HomenationalINS Magar: సెల్యూట్‌... సేవల నుంచి నిష్క్రమించిన ఐఎన్‌ఎస్‌ మగర్‌

INS Magar: సెల్యూట్‌… సేవల నుంచి నిష్క్రమించిన ఐఎన్‌ఎస్‌ మగర్‌

Telugu Flash News

INS Magar: అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగి.. శత్రువులకు సింహస్వప్నంగా ఉన్న నౌక విశ్రాంతి తీసుకుంది. నీటిలో, నేలపై సైతం శత్రువులపై దాడి చేసే సామర్థ్యం కలిగిన నైక.. ఇక వీడ్కోలు చెప్పింది. ఐఎన్‌ఎస్‌ మగర్ (మొసలి)గా పేరు గాంచిన ఈ నౌక.. శత్రువులపై దాడితో పాటు విపత్తుల వేళ కూడా విశేష సేవలందించింది.

పలు రకాల సేవలందించి భారత నౌకాదళంలో దాదాపు 36 ఏళ్ల పాటు పని చేసిన ఐఎన్ఎస్ మగర్.. ఈనెల 7వ తేదీతో తన విధులకు ఫుల్‌స్టాప్‌ పెట్టలింది.ఆదివారం ఐఎన్‌ఎస్‌ మగర్‌కు ఇండియన్‌ నేవీ ఘనంగా వీడ్కోలు పలికింది.ఉభయచర యుద్ధ నౌకల్లో చాలా కాలంపాటు కీలకంగా ఐఎన్ఎస్ మగర్ వ్యవహరించింది.

భారత నౌకాదళ చరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని సృష్టించిన ఐఎన్‌ఎస్‌ మగర్‌.. విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్ యార్డు సహకారంతో కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లో మగర్ ని యాంఫిబియాస్ షిప్ గా తీర్చిదిద్దారు.

ఒడ్డు వరకు వచ్చే సామర్థ్యం ఐఎన్‌ఎస్‌ మగర్‌కు మాత్రమే సొంతం. సైన్యానికి అవసరమైన ఆయుధ సంపత్తిని అందించడంలో మేటిగా పేరుగాంచింది. సుదీర్ఘ కాలంపాటు సేవలు అందించిన ఇక సెలవు ప్రకటించింది.

Read Also : indian currency : మన కరెన్సీ ముద్రించడానికయ్యే ఖర్చెంతో తెలుసా?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News