HomenationalInfluenza : భారత్‌లో గుబులు పుట్టిస్తున్న కొత్త వైరస్‌.. కరోనా తరహా ఫ్లూ.. లక్షణాలు ఏంటంటే..

Influenza : భారత్‌లో గుబులు పుట్టిస్తున్న కొత్త వైరస్‌.. కరోనా తరహా ఫ్లూ.. లక్షణాలు ఏంటంటే..

Telugu Flash News

Influenza : కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రజల్లో భయాందోళన మొదలై జాగ్రత్తలు పాటిస్తున్నారు. తాజాగా దేశ వ్యాప్తంగా మరో కొత్త వైరస్ గుబులు పుట్టిస్తోంది. రెండు నెలలుగా దేశ వ్యాప్తంగా దీర్ఘకాలిక దగ్గు, కరోనా లక్షణాలతో ఇన్‌ఫ్లూయెంజా కేసులు నమోదవుతుండటం కలవరపెడుతోంది. అంతేనా.. కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా కోవిడ్‌తో భయపడిన ప్రజలు.. ఇప్పుడు కొత్త వైరస్‌తో బెంబేలెత్తుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలు పోస్ట్‌ కోవిడ్‌ లక్షణాలతో సతమతం అవుతున్నారు.

కొత్తగా ఇన్‌ఫ్లుయెంజా-ఎ సబ్‌టైప్ హెచ్3ఎన్2 వైరస్ కారణంగా చాలా మంది సఫర్‌ అవుతున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఈ నేపథ్యంలో హెచ్3ఎన్2 వైరస్, ఇతర వేరియంట్ల కంటే ఎక్కువగా బాధితులు ఆస్పత్రుల్లో చేరేందుకు కారణం అవుతోందని చెబుతున్నారు. గత రెండు మూడు నెలలుగా ఇండియా అంతటా ఈ కేసులు పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ జబ్బు లక్షణాలు సాధారణ జ్వరంతో మొదలవుతాయని చెబుతున్నారు. జలుబు కూడా నిరంతరం వేధిస్తుందని చెబుతున్నారు. రోగి కోలుకున్న తర్వాత కూడా ఈ లక్షణాలు చాలా కాలం పాటు కొనసాగుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ వైరస్ వల్ల ప్రాణాపాయం లేదని క్లారిటీ ఇస్తున్నారు. అయితే, వ్యాధి బారిన పడిన వారిని తీవ్రంగా నీరసింపజేస్తోందని చెబుతున్నారు. కొంతమంది రోగుల్లో శ్వాసకోశ సమస్యలను తెచ్చిపెడుతోందట.

కొత్త వైరస్‌ లక్షణాలను డాక్టర్లు ప్రత్యేకంగా చెబుతున్నారు. దగ్గు తగ్గకపోవడం, వికారంగా ఉండటం, వాంతులు కావడం, గొంతులో మంట, బాడీ పెయిన్స్, అతిసార లక్షణాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, ఈ వైరస్ సోకకుండా కొన్ని జాగ్రత్తలను కూడా వైద్యులు సూచిస్తున్నారు. నీళ్లు, సబ్బుతో తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని చెబుతున్నారు. అలాగే ఫేస్‌ మాస్కులు ధరించాలని, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు. చేతులతో ముక్కు, నోటిని తాకడం మానుకోవాలని చెబుతున్నారు. దగ్గు, తుమ్ములు వచ్చిన సందర్భాల్లో నోటిని, ముక్కును పూర్తిగా కవర్‌ చేసుకోవాలన్నారు. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. జ్వరం లేదా ఒంటి నొప్పులు ఉన్నట్లు అనిపిస్తే పారాసెటమాల్‌ వినియోగించాలని సూచిస్తున్నారు.

also read :

naveen murder case : నవీన్‌ హత్య కేసులో పోలీసుల సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌..

-Advertisement-

medico preethi case : మెడికో ప్రీతి కేసులో సంచలన విషయాలు.. విచారణలో సైఫ్‌ కీలక అంశాల వెల్లడి

Samantha : క‌ష్ట‌కాలంలో స‌మంత‌నే అండ‌గా నిలిచిందంటూ చిన్మ‌యి ఆస‌క్తిక‌ర కామెంట్స్

Flax Seeds : అవిసె గింజలతో మీ కొవ్వును కరిగించుకోండి..

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News