Homesportsindia vs south africa match : ఈ రోజు సౌతాఫ్రికాతో భార‌త్ మ్యాచ్ జ‌ర‌గ‌డం డౌటే...!

india vs south africa match : ఈ రోజు సౌతాఫ్రికాతో భార‌త్ మ్యాచ్ జ‌ర‌గ‌డం డౌటే…!

Telugu Flash News

india vs south africa match : ఆసియా క‌ప్‌లో నిరాశ ప‌ర‌చిన భార‌త జ‌ట్టు రీసెంట్‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన టీ 20లో విజృంభించి సిరీస్ గెలుచుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఉత్సాహంతోనే బుధవారం నుంచి సౌతాఫ్రికాతో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌కు సిద్ధమైంది. ఈ పోరు భార‌త్‌కి ఎంతో కీల‌కం కానుంది.

మ‌రి కొద్ది రోజుల‌లో ప్ర‌పంచ క‌ప్ జ‌ర‌గ‌నుండ‌గా, ఈ మ్యాచ్‌ల‌తో అంద‌రు మంచి ఫామ్‌లోకి రావాల‌ని అనుకుంటున్నారు. తొలి స‌మ‌రానికి సిద్ధ‌మైన భార‌త జ‌ట్టుకి తిరువనంతపురంలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు నుంచి హోటల్కు చేరుకున్న భారత ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు కేరళ క్రికెట్ బోర్డు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసింది.

వెద‌ర్ ప్రాబ్ల‌మ్..

హోట‌ల్‌కి వ‌చ్చే దారిలో అమ్మాయిల‌తో పూలు చ‌ల్లించ‌డ‌మే కాకుండా, వారి మెడ‌లో మెడ‌ల్స్ వేయించారు. ఇక బస నేపథ్యంలో హోటల్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే మ‌రి కొద్ది గంట‌ల‌లో మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌గా, ఈ మ్యాచ్‌పై సందేహాలు నెల‌కొన్నాయి.

బుధవారం తిరువనంతపురంలో వర్షం పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. సౌతిండియాలో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో కూడా వాతావరణం చల్లగా మారింది. మంగళవారం కూడా అక్కడ వర్షం పడిన నేప‌థ్యంలో బుధ‌వారం కూడా ప‌డుతుంద‌ని భావిస్తున్నారు.

ఇక భార‌త జ‌ట్టుకి బౌలింగ్ ప్ర‌ధాన స‌మస్య‌గా మారింది. ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని ఉంచుతున్నప్పటికీ.. దాన్ని కాపాడుకోలేకపోతున్నారు. గతంలో డెత్‌ ఓవర్ల స్పెషలిస్టులుగా పేరుగాంచిన భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌.. ఇప్పుడు దారాళంగా ప‌రుగులు ఇస్తున్నారు. వారు తిరిగి తమ ఫామ్ ని అందుకోవాలని జట్టుతోపాటు అభిమానులు కోరుకుంటున్నారు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన బుమ్రా సైతం కట్టడిగా బౌలింగ్‌ చేస్తే.. ప్రత్యర్థులకు చెమటలు పట్టించడం ఖాయం. కాని బుమ్రా కూడా తేలిపోతున్నాడు. సౌతాఫ్రికాతో వీరు ఎలా ఆడ‌తారో చూడాలి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News