India vs New Zealand : టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ పూర్తయిన నేపథ్యంలో ఇక టీ20 పోరు నేటి నుంచి జరగనుంది. తొలి మ్యాచ్ రాంచీ వేదికగా ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి మొదలవుతుంది. ఇప్పటికే ఇరు జట్లు రాంచీ నగరానికి చేరుకున్నాయి. వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. ఇదే ఊపుతో టీ20 సిరీస్‌ను కూడా దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు వన్డేలో ఘోర పరాభవం మూటగట్టుకున్న కివీస్.. కనీసం టీ20 సిరీస్ అయినా దక్కించుకోవాలని ఆరాటపడుతోంది.
టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్య సారధ్యం వహిస్తున్నాడు.
చాన్నాళ్ల తర్వాత యువ క్రికెటర్ పృథ్వీ షాను జట్టులోకి తీసుకుంది బీసీసీఐ. అయితే, అతనికి తుది జట్టులో అవకాశం లభించేది అనుమానమే అని చెబుతున్నారు. గాయం కారణంగా మరో యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓపెనర్లుగా శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు పృథ్వీ షా 2021 జూలైలో శ్రీలంతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తర్వాత జట్టుకు దూరమైన షా.. ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. తాజాగా ముంబై తరఫున ఆడుతున్న పృథ్వీ షా.. అసోంతో జరిగిన మ్యాచ్‌లో 379 పరుగులతో రాణించాడు. తర్వాత అంతర్జాతీయ జట్టులో తిరిగి అవకాశం దక్కించుకోవడం విశేషం.
ఇక మరో యువ క్రికెటర్ ప్రస్తుతం డబుల్ సెంచరీ, శతకాలతో ఊపుమీదున్న శుభమన్ గిల్.. టీ20ల్లోనూ చెలరేగి ఆడతాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఇక రాహుల్ త్రిపాఠిని మూడో స్థానంలో బరిలోకి దింపే సూచనలున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో వచ్చే ఆస్కారం ఉంది. జితేష్ శర్మకు వికెట్ కీపర్‌గా చాన్స్ ఇస్తారని భావిస్తున్నారు. ఇక తుది జట్టులో ఇషాన్ కిషన్, శుభమన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్య (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ ఉండే అవకాశం కనిపిస్తోంది.
also read :
Senior actress Jamuna Passed Away నటి జమున కన్నుమూత
శర్వానంద్ ఎంగేజ్‌మెంట్ సాక్షిగా సిద్ధార్థ్-అదితి లవ్‌పై క్లారిటీ వచ్చినట్టేనా?