Telugu Flash News

India: ఈ ఏడాది భార‌త్ ప్ర‌ద‌ర్శ‌న ఎలా సాగింది.. టీ 20, వ‌న్డే, టెస్ట్ సిరీస్ లెక్క‌లు చూస్తే..!

India: మ‌రో మూడు రోజుల‌లో 2022 సంవత్సరానికి గుడ్ బై చెప్పి 2023కి వెల్‌క‌మ్ చెప్ప‌బోతున్నాం.ఈ క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రు 2022కి సంబంధించిన అనేక విష‌యాలు జ్ఞ‌ప్తికి తెచ్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ ఏడాది మొత్తం భార‌త్ ప్రద‌ర్శ‌న ఎలా సాగింది, ఎంత‌లా రాణించింది అని లెక్క‌లు వేస్తున్నారు. ముందుగా టెస్ట్ విష‌యానికి వ‌స్తే ఈ ఫార్మాట్‌లోనే భార‌త్ చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ చేతిలో ఒక టెస్టు మ్యాచ్ ఓడిన భారత్.. ఆ తర్వాతా సౌతాఫ్రికా చేతిలో రెండు టెస్టు మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఆ తర్వాత స్వదేశంలో శ్రీలంకపై సిరీస్ వైట్ వాష్ చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌పై కూడా సిరీస్ క్లీన్ స్వీప్ చేసి ఏడాదిని ఘ‌నంగా ముగించింది.

మొత్తంగా ఈ ఏడాది ఏడు టెస్టు మ్యాచులు ఆడిన భారత జట్టు అందులో నాలుగు గెలిచింది. అయితే సౌతాఫ్రికా, ఇంగ్లండ్ వంటి బలమైన జట్ల చేతిలో ఓడిపోవడం గమనార్హం. గెలిచిన టెస్టుల్లో భారత ప్రత్యర్థులు పసికూన జట్లు అయిన శ్రీలంక, బంగ్లాదేశ్. ఇక
పరిమిత ఓవర్ల క్రికెట్ విష‌యానికి వ‌స్తే 50 ఓవర్ల ఫార్మాట్లో కూడా భారత్ ఆశించింనంతగా రాణించలేదు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో భారత జట్టు మొత్తం 24 వన్డే మ్యాచులు ఆడ‌గా, వీటిలో 14 మ్యాచుల్లో టీమిండియా విజయాలు నమోదు చేసింది. రెండు మ్యాచులు ఫలితం తేలలేదు. మిగిలిన ఎనిమిది మ్యాచుల్లో ఓటములు చవిచూసింది. ఏడాది చివర్లో న్యూజిల్యాండ్, బంగ్లాదేశ్‌లతో జరిగిన వన్డే సిరీసుల్లో భారత్ ఓడిపోవడం భార‌త్ అభిమానుల‌కి ఏ మాత్రం మింగుడుప‌డ‌లేదు.
పొట్టి ఫార్మాట్‌లో పసికూనలపైనే..

ఇక టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు రికార్డు అంతంతమాత్రంగానే ఉండటం గమనార్హం. ఈ ఏడాదిలోనే ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ జ‌ర‌గ‌గా, మొత్తంగా భారత జట్టు 40 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడింది. వీటిలో వెస్టిండీస్‌తో ఆడిన 8 మ్యాచుల్లో ఏడింట భారత్ పైచేయి సాధించింది.అదే సమయంలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లపై మాత్రం అంత గొప్ప రికార్డు సాధించలేదు. ఈ జట్లపై భారత్ విజయాల శాతం 50 శాతంగా ఉంది. అయితే ఓవరాల్‌గా చూసుకుంటే 40 మ్యాచుల్లో భారత జట్టు 28 విజయాలు నమోదు చేసింది. సౌతాఫ్రికాతో జరగాల్సిన ఒక మ్యాచ్ ఫలితం లేలకపోగా.. న్యూజిల్యాండ్‌తో జరిగిన ఒక మ్యాచ్ డఆర్ఎస్ విధానంలో డ్రా అయింది. ఇలా 2022లో భార‌త్ అన్ని ఫార్మాట్స్‌లోను చెత్త ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింద‌నే చెప్పాలి.

Exit mobile version