Ind vs Pak: టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ రోజు మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ కోసం భారత్ – పాక్ క్రికెట్ అభిమానులే కాకుండా ఇతర దేశాలకు చెందిన అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్‌కి 90 వేలకు పైగా టికెట్లు నిమిషాల్లో అమ్ముడైపోయాయి. రికార్డు స్థాయిలో ప్రేక్షకులు ఈ మ్యాచ్ కోసం స్టేడియానికి రాబోతున్నారు.
గత వరల్డ్ కప్ లో ఎదురైనా ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. మళ్లీ టీమిండియాను ఇంటిదారి పట్టించాలని పాకిస్థాన్ చూస్తోంది. మెల్ బోర్న్ వేదికగా భారత్, పాకిస్థాన్ ల మధ్య మ్యాచ్ మధ్యాహ్నం 1.30 నుంచి ప్రారంభంకానుంది.
తిక్క కుదిరింది..
అయితే ఈ మ్యాచ్‌పై అందరు చాలా ఆసక్తిగా ఉంటే ఇంగ్లండ్ క్రికెట్ టీం ఫ్యాన్ పేజ్ సెటైరికల్ ట్వీట్ చేసింది. ఇండియా-పాక్ మ్యాచ్ ఏంటి.. మేమెప్పుడు దీని గురించి వినలేదు అంటూ ట్వీట్ చేసింది.
What’s an India vs Pakistan 🤔
Never heard of it.
— England's Barmy Army (@TheBarmyArmy) October 22, 2022
దీనికి భారత్, పాక్ క్రికెట్ అభిమానులు ధీటుగా స్పందిస్తూ ట్వీట్స్ వేస్తున్నారు. చింతించనక్కర్లేదు. ఇది క్రికెట్. మీకు తెలియదులేండి.. ప్రధాన మంత్రి అంటే మీకు తెలుసా? ఇది కూడా ఎప్పుడు వినలేదా అంటూ ట్వీట్ చేశారు.
Don’t worry, it’s a cricket thing, you guys wouldn’t know. Real quick: Do you know what’s a Prime Minster? Let me guess, never heard of it?
— Govind Prakash (@govindprakash) October 22, 2022
యూకే ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేయడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ కొందరు సెటైర్స్ వేస్తున్నారు.. సెప్టెంబరు 7న యూకే ప్రధానిగా బోరిస్ జాన్సన్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన లిజ్ ట్రస్ కేవలం 44 రోజుల వ్యవధిలోనే రాజీనామా చేసింది. ఈ క్రమంలో బ్రిటన్ చరిత్రలో తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా లిజ్ ట్రస్ నిలిచింది.
Perhaps you guys need another ASHES beat to get your memory straight.
— Zubair 🇵🇸 (@jut054) October 22, 2022
ఇంగ్లాండ్ టీమ్‌ని ట్రోల్ చేయడంలో ముందుండే భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ రీసెంట్గా.. ఓ జోక్ పేల్చాడు. దానికి నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. టీ20 వరల్డ్‌కప్ 2022 ఆడే జట్లపై స్వాట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చిన వసీం జాఫర్.. తన ట్వీట్లో…
Was doing a SWOT analysis for T20 WC participating teams and realised:
India don't have a 150K+ bowler.
Pak don't have a seasoned finisher.
NZ don't have a great record in Aus.
SL don't have an experienced squad.
England don't have a Prime Minister. #T20worldcup22 #LizTruss— Wasim Jaffer (@WasimJaffer14) October 20, 2022
‘‘భారత జట్టుకి 150కిమీ వేగంతో బంతులు వేసే బౌలర్ లేడు.. పాకిస్థాన్ జట్టులో మ్యాచ్‌ని ఫినిష్ చేసే ఫినిషర్ లేడు.. న్యూజిలాండ్‌కి ఆస్ట్రేలియా గడ్డపై గొప్ప రికార్డ్ లేదు. శ్రీలంక జట్టులో అనుభవం ఉన్న ప్లేయర్లు లేరు. ఇంగ్లాండ్ టీమ్‌కి ఇప్పుడు ప్రధాన మంత్రి లేడు’’ అని ఫన్నీగా రాసుకొచ్చాడు.