HomesportsInd vs SA: శ్రేయాస్ అయ్య‌ర్ సెంచ‌రీ.. అద్భుత విజ‌యం సాధించిన టీమిండియా

Ind vs SA: శ్రేయాస్ అయ్య‌ర్ సెంచ‌రీ.. అద్భుత విజ‌యం సాధించిన టీమిండియా

Telugu Flash News

Ind vs SA: తొలి వ‌న్డేలో తృటిలో విజ‌యం మిస్ చేసుకున్న టీమిండియా రెండో వ‌న్డేలో మాత్రం అద్భుత విజ‌యం సాధించింది. 279 ప‌రుగులు ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన టీమ్ ఇండియా శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్ మెరుపు బ్యాటింగ్‌తో మ‌రో నాలుగు ఓవ‌ర్లు మిగిలుండ‌గానే గెలుపుని త‌మ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో హైలైట్స్ ఏంటంటే.. శ్రేయ‌స్ అయ్య‌ర్ సెంచ‌రీ సాధించ‌గా ఇషాన్ కిష‌న్ తృటిలో సెంచ‌రీ మిస్స‌య్యాడు. భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన భార‌త్‌కి ఆదిలోనే క‌ష్టాలు ఎదుర‌య్యాయి. భార‌త్ 50 ప‌రుగుల లోపే కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్‌, శుభ్‌మ‌న్‌గిల్ వికెట్ల‌ను కోల్పోయింది.

భార‌త్‌ అద్భుత విజ‌యం

రెండో వ‌న్డేలో ధావ‌న్ 13 ప‌రుగులు చేయ‌గా, శుభ్‌మ‌న్ గిల్ 28 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. ఇక అప్పుడు ఇషాన్ కిష‌న్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ క‌లిసి టీమ్ ఇండియాను గెలుపు బాట ప‌ట్టించ‌గా, వీరు మూడో వికెట్‌కు 161 ప‌రుగులు జోడించారు. ఈ మ్యాచ్‌లో అయ్యర్, కిషన్ రెండు ఎండ్‌ల నుంచి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. కిషన్‌ ఔటైన తర్వాత అయ్యర్‌కు సంజూ శాంసన్‌ జతకట్ట‌డంతో వీరు ఇద్దరూ ధాటిగా ఆడుతూ భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. అయ్యర్ 111 బంతుల్లో 113 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 15 ఫోర్లు ఉన్నాయి. కాగా కిషన్ 84 బంతుల్లో 93 పరుగులు చేసి అదుర్స్ అనిపించాడు.

ఇక‌ సంజూ శాంసన్ త‌న ఫామ్‌ని కొన‌సాగిస్తూ 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా రీజా హెండ్రిక్స్, ఐడాన్ మార్క్‌రామ్‌ రాణించడంతో భారీ స్కోరు సాధించింది. ఆరంభంలో టీమిండిమా బౌలర్లు రాణించడంతో క్వింటన్ డి కాక్ రూపంలో పర్యాటక జట్టు 7 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోగా, ఆ తర్వాత 40 పరుగుల వద్ద మలన్ ఔటయ్యాడు. ఆ స‌మ‌యంలో హెండ్రిక్స్ మార్క్రామ్ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్ర‌య‌త్నం చేసారు. ఇద్దరూ అర్ధ సెంచరీలు చేయడంతో పాటు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు . ఈ మ్యాచ్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌లో ఇండియా, సౌతాఫ్రికా 1-1 తో స‌మంగా నిలిచాయి. ఢిల్లీలో డిసైడ‌ర్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News