Ind vs Pak: టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఎంత ఉత్కంఠ భరితంగా మారిందో మనం చూశాం. నిన్నటితో సూపర్ 12 రౌండ్ పూర్తి కాగా, ఇక ఇప్పుడు సెమీస్ టైం వచ్చేసింది. బుధవారం న్యూజిలాండ్ పాక్ తలపడనుండగా, గురువారం ఇంగ్లండ్ ఇండియా సెమీస్ ఫైట్‌లో పోటీ పడనున్నాయి. వీటిలో ఎవరు గెలిస్తే వారు ఫైనల్‌లో తలపడతయి. అయితే ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా, జింబాబ్వేతో తలపడగా, భారీ విజయం సాధించిన టాప్‌లో నిలిచింది. అయితే పాకిస్తాన్‌పై 1 పరుగు తేడాతో ఉత్కంఠ విజయం అందుకున్న భారత్…జింబాబ్వే, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆఖరి ఓవర్ ఆఖరి బంతిదాకా పోరాడింది.
మంచి మజా ఖాయం..
అసలు గ్రూప్‌బీలో సెమీస్‌కి సౌతాఫ్రికా ఖాయం అనుకున్న సమయంలో ఈ జట్టు నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులో దారుణంగా ఓడిపోవడం అందరిని షాక్ కి గురి చేసింది..ర్యాంకింగ్స్ లో ఎక్కడో 17వ స్థానం లో ఉన్న నెదర్లాండ్స్ సౌత్ ఆఫ్రికా ని చాలా తేలికగా ఓడించేయడం, ఆ తర్వాత పాక్… బంగ్లాపై నెగ్గి సెమీస్‌కి రావడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఇక ఇప్పుడు అందరి చర్చ ఫైనల్స్ మ్యాచ్ భారత్ – పాకిస్థాన్ మధ్య ఉండబోతుందా అని. అందుకు అవకాశం కూడా ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.
సెమీస్‌లో పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ తో తలపడబోతోంది. ఇండియా- ఇంగ్లండ్ ఫైట్ చేయనున్నాయి. ఈ రెండు మ్యాచులలో భారత్ – పాక్ లు గెలిస్తే ఫైనల్స్ లో మనం భారత్ – పాక్ లో మధ్య భీకరమైన పోరుని చూసే అవకాశం ఉంటుంది.
భారత్ – పాక్ ఇద్దరు కలిసి సెమిస్ లోకి వెళ్లడం 2007వ సంవత్సరం తర్వాత ఇప్పుడే అని చెప్పాలి. అప్పట్లో ఫైనల్స్ కి కూడా వెళ్లిన జట్లు ఈ రెండే..ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో పోటీ పడనున్నాయా అనేది సస్పెన్స్. 2007వ సంవత్సరంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 157 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోగా, ఆ స్కోర్ పాకిస్తాన్ ఛేదించలేకపోయింది.
also read:
Uday Kiran: ఉదయ్ కిరణ్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో తనకు తెలుసంటూ తేజ సంచలన కామెంట్స్