HomesportsInd vs Aus: చివ‌రి బంతి వ‌రకు ఉత్కంఠ‌గా సాగిన మ్యాచ్.. భార‌త్ అద్భుత‌ విజయం..

Ind vs Aus: చివ‌రి బంతి వ‌రకు ఉత్కంఠ‌గా సాగిన మ్యాచ్.. భార‌త్ అద్భుత‌ విజయం..

Telugu Flash News

Ind vs Aus: ఉప్ప‌ల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన చివ‌రి టీ 20లో భార‌త్ విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేసి టైటిల్‌ని ముద్దాడింది. పాత సెంటిమెంట్‌కి అనుగుణంగానే భార‌త్ విజ‌యదుందుభి మోగించింది. చివరి ఓవర్ వరకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి భారత్‌నే విజయం వరించడం విశేషం.

ఒకానొక ద‌శ‌లో సునాయాసంగా గెల‌వొచ్చ‌నే విధంగా ఉండ‌గా, రాను రాను మ్యాచ్ టైట్ అయింది. చివరి 2ఓవర్లో 21పరుగులు కావాల్సిన దశలో 19వ ఓవర్లో 10పరుగులు రాగా.. చివరి ఓవర్లో గెలుపునకు 11పరుగులు కావాల్సిన తరుణంలో కోహ్లీ, పాండ్యా భార‌త్‌కి విజ‌యం ద‌క్కేలా చేశారు.

అద్భుత‌మైన విజయం..

చివ‌రి ఓవ‌ర్‌లో తొలి బంతికి సిక్స్ కొట్టి 2వ బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు కోహ్లీ. దీంతో టెన్ష‌న్ వాతార‌ణం నెల‌కొంది. అయితే హార్ధిక్ పాండ్యాకి ల‌క్కీ బౌండ‌రీ రావ‌డంతో విజ‌యం భార‌త్‌ని వ‌రించింది. ఇక ఈ మ్యాచ్‌లో అక్ష‌ర్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. అక్షర్ పటేల్ (4-0-33-3) నాలుగు ఓవర్లలో మూడు కీలక వికెట్లు తీయడంతో పాటు ఓ కీలక రనౌట్ చేసి రాణించాడు.

 

దీంతో ఆయ‌న గెలుపులో సగం పాత్ర పోషించాడు. ఇక ఛేజింగ్లో రారాజుగా పేరొందిన కోహ్లీ ఇన్నింగ్స్ రిక్వయిడ్ రన్ రేట్ పడిపోకుండా ఓ పద్ధతి ప్రకారం.. ఇన్నింగ్స్  ఆడాడు. కోహ్లీ (63పరుగులు 48బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) ఇన్నింగ్స్.. జట్టు విజయానికి వెన్నెముకలా నిలిచిందన‌డంతో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.

Ind vs Aus

-Advertisement-

ఇక నయా మిస్టర్ 360.. కుదురుకుంటే ఎంతటి మ్యాచ్ అయినా వన్ సైడ్ కావాల్సిందే అని ఉప్ప‌ల్ మ్యాచ్‌లో మ‌రోసారి అర్ధ‌మైంది. ఈ మ్యాచ్‌లో మొద‌ట కాస్త స్లోగా ఆడిన సూర్య‌.. కాస్త కుదురుకున్నాక ఆసీస్ బౌలర్లకు తన మాస్టర్ క్లాస్ షాట్లని ప‌రిచ‌యం చేశాడు.

సూర్య (69పరుగులు 36బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సర్లు) విధ్వంసం సాగ‌డంతో మ్యాచ్ భార‌త్ వైపు మ‌ళ్లింది. ఇక చాహాల్ కూడా ఈ మ్యాచ్ లో అద్భుత‌మైన బౌలింగ్ చేయ‌గా, చివ‌రి ఓవ‌ర్‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్ ఏడు పరుగులు మాత్ర‌మే ఇచ్చి భార‌త విజ‌యంలో కీల‌క పాత్ర పోషిచారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News