Iron deficiency | మన శరీరానికి అనేక పోషకాలు అవసరం. అందులో ఐరన్ ఒక ముఖ్యమైన పోషకం. ఐరన్ లేకపోతే శరీరంలో రక్త కణాలు తయారవవు. దీని వల్ల అలసట, శక్తి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
ఎంత ఐరన్ అవసరం?
14 నుండి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పురుషులకు రోజుకు 11mg ఐరన్ అవసరం.
14 నుండి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న స్త్రీలకు రోజుకు 15mg ఐరన్ అవసరం.
19 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పురుషులకు రోజుకు 8mg ఐరన్ అవసరం.
19 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న స్త్రీలకు రోజుకు 18mg ఐరన్ అవసరం.
గర్భిణీ స్త్రీలకు రోజుకు 27mg ఐరన్ అవసరం.
ఐరన్ లెవెల్స్ పెంచుకోవడానికి ఏం చేయాలి?
చికెన్, మటన్ వంటి మాంసాహారంలో ఐరన్ అధికంగా ఉంటుంది.
శాకాహారులు పాలకూర, పప్పులు వంటి ఆహారాలను తీసుకోవచ్చు.
బాదం, చియా సీడ్స్ వంటి నట్స్ మరియు విత్తనాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
ఐరన్‌ను శరీరం సరిగ్గా శోషించుకోవడానికి విటమిన్ సి అవసరం. పాలకూరతో నిమ్మ రసం కలిపి తీసుకోవచ్చు.
ఎలాంటి ఆహారాలు తినకూడదు?
కాఫీ, టీ: కాఫీ, టీల్లో ఉండే కెఫీన్ మరియు టానిన్లు ఐరన్ శోషణను అడ్డుకుంటాయి.
క్యాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు: పాలు, జున్ను వంటి ఆహారాలను ఐరన్ ఆహారాలతో కలిపి తినకూడదు.