Homebigg boss telugu season 6Bigg Boss 6: ఇన‌య ర‌చ్చ‌.. సిగ్గుందా అంటూ మండిప‌డిన రేవంత్

Bigg Boss 6: ఇన‌య ర‌చ్చ‌.. సిగ్గుందా అంటూ మండిప‌డిన రేవంత్

Telugu Flash News

Bigg Boss 6: వ‌రల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ఎంత రంజుగా మారుతుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. కంటెస్టెంట్స్ అంద‌రు రెట్టించిన ఉత్సాహంతో గేమ్ ఆడుతుండ‌గా, ఆ క్ర‌మంలో కొంద‌రు అయితే నోరు జార‌డం, మ‌రి కొంద‌రు చేయి చేసుకోవ‌డం వంటివి కూడా చేస్తున్నారు.

ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో మూడో వారం కెప్టెన్సీ టాస్క్ న‌డుస్తుంది. ఈ టాస్క్‌లో పోలీసులు, దొంగ‌లు, అత్యాశ క‌లిగిన వ్యాపార‌స్థురాలు అంటూ కంటెస్టెంట్స్‌ని విభ‌జించిన విష‌యం తెలిసిందే. ఈ టాస్క్ అయితే భీబ‌త్సంగా మారుతుంది. పోలీసులే తాము కాపాడాల్సిన వస్తువులను దొంగతనం చేయ‌డంతో, బిగ్ బాస్ మరోసారి టాస్క్ గురించి వివరించాల్సి వ‌చ్చింది.

నానా ర‌భ‌స‌..

టాస్క్ ప్ర‌కారం పోలీస్‌లు రైడ్‌కు వెళ్లినప్పుడు దొంగలు వారిని పట్టుకోవచ్చు.. రైడ్ టైం ముగిసిన తరువాత కూడా పోలీసులు ఇంట్లోనే ఉంటే వారిని కిడ్నాప్ చేసే అవ‌కాశం ఉంది. అయితే పోలీసులు స్టోర్ రూంను రైడ్ చేస్తామని చెప్పలేక‌పోవ‌డంతో ఇనయ లోపలకు వెళ్లింది. దీంతో దొంగలు ఆమెను పట్టుకున్నారు.

బ‌య‌ట‌కు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా, చిన్న‌పాటి తోపులాట జ‌రిగింది. ఈ క్ర‌మంలో త‌న‌ను తాను త‌ప్పించుకునే క్ర‌మంలో ఆరోహిని కాలితో త‌న్నింది ఇన‌య‌. ఇక నేహా చెంప చెళ్లుమ‌నిపించిన‌ట్టు తెలుస్తుంది.

ఇక త‌న తన డ్రెస్‌ను ఎవరో పైకి లాగారంటూ.. గ‌ట్టిగా అర‌చేసింది. ఇక మ‌ధ్య‌లో దూరిన గీతూ ఇవన్నీ తప్పు మాటలు.. అలా జరగలేదు అంటూ చెప్పుకొచ్చింది. నువ్ తప్పు మాటలు మాట్లాడుతున్నావ్.. మాటలు మారుస్తున్నావ్ అంటూ ఇన‌య‌తో గొడ‌వ ప‌డింది.

ఈ క్ర‌మంలో చాలా సేపు ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ఇక రేవంత్ బొమ్మ‌ల‌ని ప్లాన్ చేసి నేహా, ఆరోహి దొంగిలించారు. రేవంత్‌ను కంటెండర్‌గా అవ్వకూడదని ప్లాన్ వేసి మరీ కొట్టేశారు. దీంతో త‌న బొమ్మ‌లు దొంగిలించిన వారికి సిగ్గు శ‌రం లేదంటూ మాట్లాడాడు.

-Advertisement-

ఇంతలో పింకీ, రేవంత్ మధ్య చిన్నపాటి గొడవ జరుగుతుంది. నీ బొమ్మలు పోయాయని చెప్పి టీం మొత్తాన్ని రిస్క్ లో పెట్టడం క‌రెక్టా అని ప్ర‌శ్నిస్తుంది. మ‌రోవైపు ఇనయ, కీర్తి మధ్య తీవ్రంగా వాగ్వాదం జరుగుతుంది. దొంగల గ్యాంగ్ లో సూర్య.. పోలీస్ గా ఉన్న మెరీనాని కిడ్నాప్ చేసి బంధిస్తాడు..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News