Homebigg boss telugu season 6Bigg Boss Telugu 6: డేంజ‌ర్ జోన్‌లో ఆ ముగ్గురు.. హౌజ్ నుండి ఈ వారం ఎలిమినేట్ కానుంది ఎవ‌రంటే..!

Bigg Boss Telugu 6: డేంజ‌ర్ జోన్‌లో ఆ ముగ్గురు.. హౌజ్ నుండి ఈ వారం ఎలిమినేట్ కానుంది ఎవ‌రంటే..!

Telugu Flash News

Bigg Boss Telugu 6: తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరిస్తున్న గేమ్ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం ఇప్ప‌టికే ఐదు సీజ‌న్స్ పూర్తి చేసుకొని ఆరో సీజ‌న్ జ‌రుపుకుంటుంది. తెలుగులో ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ ఈ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించ‌గా, ఆ తర్వాత సీజన్‌కు నాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా ఉన్నారు.

ఇక మూడో, నాలుగు, ఐదు సీజన్స్‌కు మాత్రం నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. మ‌ధ్య‌లో వ‌చ్చిన బిగ్ బాస్ నాన్ స్టాప్ షోకి కూడా నాగార్జుననే హోస్ట్ చేశారు. ఇక తాజాగా ప్ర‌సారం అవుతున్న సీజ‌న్ 6కి కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం మ‌నం చూస్తున్నాం.

ఇక ఈ సీజన్‌లో 21 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్ట‌గా, అందులో కొంద‌రు త‌ప్ప మిగ‌తా వారు ముఖ పరిచయం లేని వాళ్లు ఉండటం గమనార్హం.

వేటు త‌ప్ప‌దా..

షో రంజుగానే సాగుతుండ‌గా, హౌజ్ నుండి ఇప్ప‌టికే ఇద్ద‌రు ఎలిమినేట్ అయ్యారు. షానీ, అభిన‌య‌శ్రీని నాగార్జున రెండో వారంలో ఎలిమినేట్ చేశాడు.ఇక ఇప్పుడు మూడో వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అనే ఆస‌క్తి అంద‌రిలో ఉంది.

ఈ వారం ఎలిమినేషన్‌లో 9 మంది ఉండ‌గా, వీరిలో బాలాదిత్య, నేహా, గీతు, రేవంత్ , శ్రీహన్, చలాకీ చంటి ల‌కు బాగానే ఓల్స్ ప‌డ్డాయి. దీంతో వారు టాప్‌లో ఉన్నారు. ఇక డేంజర్ జోన్‌లో సుదీప,ఆరోహి,ఇనయా సుల్తానా ఉన్నారు. మొత్తంగా వీరిలో నుండే ఒక‌రు ఈ వారం హౌజ్ ని వీడ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

రామ్ గోపాల్ వ‌ర్మ బ్యూటీ ఇనాయా సుల్తానా అత్యుత్సాహం ఆమెని హౌజ్ నుండి ఎలిమినేట్ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డం, మాట‌లు జార‌డం వంటివి ఆమెకు మైన‌స్ అయినట్టు తెలుస్తుంది.

-Advertisement-

ఇన‌య‌కే హౌజ్ నుండి వెళ్లే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి అని చెబుతున్నారు. ఇక హౌస్‌లో ఉన్న వాళ్లలో అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్ రేవంత్ కాగా, ఆయ‌న‌కు రెమ్యున‌రేష‌న్ కూడా భారీగా ముట్ట‌జెబుతున్నార‌ని స‌మాచారం. అయితే రేవంత్ ఊహించిన దాని క‌న్నా ఎక్కువ‌గా గేమ్ ఆడ‌లేక‌పోతున్నాడ‌ని తెలుస్తుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News