Homebigg boss telugu season 6Inaya: ఇన‌య ఎలిమినేట్‌.. మిడ్ వీక్‌లో మ‌రో ఎలిమినేష‌న్‌తో బిగ్ ట్విస్ట్ ఇవ్వ‌బోతున్న బిగ్ బాస్

Inaya: ఇన‌య ఎలిమినేట్‌.. మిడ్ వీక్‌లో మ‌రో ఎలిమినేష‌న్‌తో బిగ్ ట్విస్ట్ ఇవ్వ‌బోతున్న బిగ్ బాస్

Telugu Flash News

Inaya: బిగ్ బాస్ సీజ‌న్ 6లో ఈ సారి కొంత కొత్త ద‌నం క‌నిపిస్తుంది. ఏకంగా 21 మంది కంటెస్టెంట్స్‌ని హౌజ్‌లోకి ప్ర‌వేశ పెట్టిన నిర్వ‌హకులు వైల్డ్కకార్డ్ ఎంట్రీ లేకుండానే షో పూర్తి చేస్తున్నారు. ఇక రెండుసార్లు డ‌బుల్ ఎలిమినేష‌న్ చేయ‌గా, ఎప్పుడు లేని విధంగా ఈ సారి మిడ్ వీక్‌లో ఓ ఎలిమినేష‌న్ జ‌ర‌గ‌నుంది.అయితే ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున ఇనయా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. వేదికపైకి వెళ్లిన ఇనయా సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు. నేనెవరో కూడా తెలియకుండా స‌పోర్ట్ చేశారు. ఇన్ని వారాలు హౌస్లో ఉండేలా చేసిన ప్ర‌తి ఒక్క‌రికి ఇన‌య కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. స్క్రీన్ పై తన బ్యూటిఫుల్ జర్నీ చూసుకొని ఇనయా ఎమోష‌న‌ల్ అయింది.

అనంతరం హౌస్లో ఉన్న ఆరుగురు సభ్యులలోని ఒక గుడ్ క్వాలిటీ, బాడ్ క్వాలిటీ చెప్పాలని ఇనయాను నాగార్జున ఆదేశించారు. ఆరుగురు సభ్యుల గుడ్, బ్యాడ్ క్వాలిటీస్ ఇనయా చెప్పారు. నువ్వు టైటిల్ కొట్టాలని కోరుకుంటున్నాను, అని ఇనయా శ్రీహాన్ కి చెప్పడం విశేషంగా మారింది. ఇక ఇన‌య‌ని పంపిన త‌ర్వాత విన్నర్ గెలుచుకునే ప్రైజ్ మనీ, ఇతర బహుమతుల గురించి మరోసారి గుర్తు చేశాడు నాగార్జున. అనంతరం కంటెస్టెంట్స్ కి తెలియని షాకింగ్ న్యూస్ నాగార్జున కేవలం ఆడియన్స్ తో పంచుకున్నారు. అదే మిడ్ వీక్ ఎలిమినేషన్. ఫైనల్ కి ఐదుగురు సభ్యులు మాత్రమే వెళ్లాలి. ఫస్ట్ సీజన్ నుండి అది రూల్ గా ఉంది.

ఈ క్ర‌మంలో మిడ్ వీక్ ఎలిమినేష‌న్‌తో ఒక‌రిని బ‌య‌ట‌కు పంప‌బోతున్నారు. బుధవారం వరకు వచ్చిన ఓట్లు పరిగణలోకి తీసుకొని తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది, అన్నారు. ప్రేక్ష‌కుల ఓట్ల ప్ర‌కార‌మే ఎలిమినేష‌న్ జ‌రుగుతుంద‌ని నాగ్ తెలియ‌జేశారు. అయితే 14వ వారమే మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అందరూ భావించిన‌,అనూహ్యంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఫైనల్ వీక్ లో పెట్టగా ఇది ఎలా సాగుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News