HomecinemaTollywood: ఈ 10 సినిమాలు సూప‌ర్ హిట్.. కాని స‌మాజానికి ఎంత‌లా చెడు సందేశం అందించాయంటే..

Tollywood: ఈ 10 సినిమాలు సూప‌ర్ హిట్.. కాని స‌మాజానికి ఎంత‌లా చెడు సందేశం అందించాయంటే..

Telugu Flash News

Tollywood: సినిమాలు స‌మాజంపై తప్ప‌క ప్ర‌భావం చూపిస్తాయి. మేక‌ర్స్ సినిమాలు తెరకెక్కించే స‌మయంలో వినోదం అందించ‌డంతో పాటు అందులోని స‌న్నివేశాలు స‌మాజానికి ఎంత ఉపయోగ‌ప‌డ‌తాయి అనేది చూడాలి.

వ‌ల్గర్ కంటెంట్‌తో సినిమాలు చేస్తే ఫ్యామిలీ ఆడియ‌న్స్ చాలా ఇబ్బందులు ప‌డ‌తారు.ఇక అన్యాయం వైపు ఉన్న వ్యక్తుల్ని హీరోలుగా.. వాటిని అడ్డుకున్న వారిని విలన్లుగా చూపించటం కొన్ని సినిమాల్లో జరుగుతుంది. అది చూసి ప్రేక్షకులు వారిని అనుకరించటం వంటివి చేయడం మొదలు పెడితే అది స‌మాజానికి చాలా పెద్ద ఇబ్బందిగా మారుతుంది. అయితే అలాంటి సినిమాలు హిట్ అయిన స‌మాజంపై త‌ప్ప‌క ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాంటి కొన్ని సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఇడియ‌ట్ సినిమాలో అమ్మాయి మనోభావాలతో సంబంధం లేకుండా కౌగిలించుకో, ముద్దుపెట్టు అని హీరో హీరోయిన్ ను వేధిస్తుంటే అదే ట్రెండ్ అని యూత్ ఫాలో అయిపోతున్నారు.

పోకిరి సినిమా యూత్ మీద ఎంతో ప్రభావం చూపించింది .. కృష్ణ మనోహర్ ని చూసి నేర్చుకుందామని ఎవ‌రు అనుకోడు .. కానీ పండు గాడ్ని చూసి మాత్రం చాలా విధాలుగా చెడిపోయారు యూత్.

చిత్రంమూవీలో దర్శకుడు ఒక మెసేజ్ ఇద్దామని ట్రై చేస్తే అది చాలా ఎబ్బెట్టుగా మారింది.

ఖతర్నాక్ సినిమాలో మనకి విద్య చెప్పే గురువుల్ని గౌరవించేలా రేపటి తరానికి నేర్పించాలి కానీ ఈ సినిమా లో దానికి పూర్తి వ్యతిరేకం గా చూపించారు.

-Advertisement-

అర్జున్ రెడ్డి సినిమాలో హీరో పాత్ర కానీ, హీరోయిన్ తో ప్రవర్తించే విధానం కానీ సరిగా ఉండవు.

నాని న‌టించిన నేను లోకల్ సినిమాలో ఒక అమ్మాయిని నిజం గా ప్రేమించిన వ్యక్తి జీవితంలో స్థిర ప‌డ్డాక అమ్మాయిని నిత్యం వేధిస్తూ.. ఆమె తండ్రిని కించపరుస్తూ ఉంటాడు, అయిన కూడా ఈ చిత్రం హిట్ అయింది.

హార్ట్ ఎటాక్ మూవీలో హీరో నీ నుంచి ఒక్క ముద్దు ఇస్తే చాలు.. ఇంకేం వద్దు అని చెప్తాడు..ఇదే హీరోయిజం ఈ సినిమాలో.

ఆర్ ఎక్స్ 100 చిత్రంలో హీరో ..హీరోయిన్ కోసం చేసే దుర్మార్గాలు అన్ని ఈ చిత్రం లో చూపించారు.

ఉప్పెన‌ లో సరిగా జీవితం అంటే ఏంటో తెలియని ఒక అమ్మాయి.. ఒక పేద వ్యక్తి దగ్గర దొరికిన స్వేచ్చని ప్రేమని కోరుకోవ‌డం చాలా విచిత్రంగా అనిపించింది.

పుష్ప‌ లో అయితే నేరస్తుడే హీరో. అతన్ని అడ్డుకొనే పోలీసులు విలన్లు . ఇలాంటి చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించాయి.

also read news:

చనిపోయిన వ్యక్తి మళ్లీ బ్రతుకుతారా ? నిజం చేసి చూపిస్తామంటున్న శాస్త్రవేత్తలు!

‘టీ’ అనే పేరు ఎలా వచ్చింది ? చాయ్ చరిత్ర ఏంటి ? ఈ స్టోరీ చదివి తెలుసుకోండి

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News