HomedevotionalSpirituality: పూజ తర్వాత హారతి.. ఆంతర్యం ఏమిటో తెలుసా?

Spirituality: పూజ తర్వాత హారతి.. ఆంతర్యం ఏమిటో తెలుసా?

Telugu Flash News

Spirituality: హిందూ ధర్మం ప్రకారం నిత్య పూజ చేసుకోవడం చాలా మంది ఇళ్లలో నిత్యకృత్యం. స్తోమతను బట్టి ఎవరి ఇంట్లో వారు పూజాదికాలు చేసుకుంటూ ఉంటారు. అయితే, షోడశోపచారాలలో ఒకటైన హారతి లేనిదే పూజ సంపూర్ణం కాదని పెద్దలు చెబుతారు. హారతి కళ్లకు అద్దుకున్న తర్వాత మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంతకీ ఆ హారతిని ఎందుకిస్తారనేది చాలామందికి తెలియదు. హారతి వెనకున్న ఆంతర్యం ఏమిటనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం. దీని వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు.

​పూజ తర్వాత హారతి ఇచ్చేటప్పుడు సాధారణంగా గంట మోగిస్తుంటారు. గంట మోగించడం భగవంతుడిని పిలవడంతో పోలుస్తారు. ఈ సమయంలో రెండు చేతులతో హారతిని కళ్లకు అద్దుకుంటూ ఉంటారు. భక్తిపూర్వకంగా భగవంతుడికి నమస్కారం పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో ప్రదేశాల్లో శంఖాన్ని కూడా ఊదుతుంటారు. గంట మోగించడం, శంఖారావ శబ్దం కారణంగా మనసు ప్రశాతత చేకూరుతుంది. మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా భగవంతుడిపై మనసు లగ్నం అయ్యేలా ఈ శబ్దాలు ఉంటాయి.

ఇలా చేయడం వల్ల శరీరంలో నిద్రిస్తున్న ఆత్మ మేల్కొంటుందని పండితులు చెబుతున్నారు. శరీరంలో నూతన ఉత్తేజం వస్తుందని స్పష్టం చేస్తున్నారు. దేవాలయాల్లో ఎలాంటి కృత్రిమమైన దీపాలూ ఒకప్పుడు ఉండేవి కాదు. కేవలం నూనెతో వెలిగించే దీపాలే ఉండేవి. గాలి కూడా రాకుండా రాతితో నిర్మాణాలు ఉండేవి. దీంతో తేమ అధికంగా ఉండేది. దుర్వాసన, సూక్ష్మక్రిములు చేరేవి. కర్పూరానికి సూక్ష్మక్రిములను సంహరించే శక్తి, అంటువ్యాధులను నివారించే గుణం ఉన్నాయని ప్రాచీన వైద్యులు సైతం తేల్చి చెప్పారు.

దేవుడికి ఇచ్చిన హారతిని కళ్లకు అద్దుకోవడం చాలా మంది చేసే పని. ఈ ప్రక్రియతో కళ్లకి చలువ చేస్తుందని చెబుతారు. భగవంతుని మూలవిరాట్టుని నేరుగా తాకలేం కాబట్టి, హారతి ద్వారా దేవుడిని స్పర్శించుకుంటున్నామన్న తృప్తి కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. ఇక హారతి వెనక శాస్త్రీయ కారణం కూడా ఉంది. పళ్లెంలో పత్తి, నెయ్యి, కర్పూరం, పువ్వులు, గంధం లాంటి సామాగ్రిని పెడుతుంటారు. వీటితోనే హారతిని ఇస్తుంటారు. కర్పూరాన్ని వెలిగించడం ద్వారా అద్భుతమైన సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి. సువాసన నలుదిశలా వెదజల్లుతుంది. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. నెగిటివ్‌ ఎనర్జీ దూరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Read Also : Sarath Babu: ఆ చిన్న త‌ప్పు శ‌ర‌త్ బాబు ప్రాణాల‌ని హ‌రించిందా.. అలా చేయ‌క‌పోయి ఉంటే..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News