Ileana: గోవా బ్యూటీ ఇలియానా పెళ్లి కాకుండానే తల్లైంది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న ఈ భామ గర్భవతిగా ఉన్నప్పుడు తనకు ఎదురవుతున్న అనుభవాలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వస్తుంది.ఈ క్రమంలో తాజాగా తన అనుభవాన్ని షేర్ చేసుకుంది. నెలలు నిండుతున్న తరుణంలో బిడ్డ కదలికలు ఆమెకు అర్థం అవుతున్నాయని చెప్పుకొచ్చింది. కడుపులో బిడ్డ ఒకటే తంతున్నాడని, దాని వలన పడుకోలేకపోతున్నాను అని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
ఏప్రిల్ 18న హీరోయిన్ ఇలియానా డి క్రూజ్ తన పోస్ట్‌తో గర్భం దాల్చినట్టు చెప్పుకొచ్చింది. పెళ్ళి కాకుండా తల్లయ్యానని ఇంత నిర్భయంగా ప్రకటించడంతో అందరు షాక్ అయ్యారు.అసలు ఇలియానాను తల్లిని చేసింది ఎవరనే సస్పెన్స్ ఇప్పటికీ కొనసాగుతోంది. దీనిపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే అందరి అనుమానాలు కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్ లారెన్ట్ మైఖేల్ పైనే ఉన్నాయి. కొన్నాళ్లుగా వీరిద్దరు సీక్రెట్‌గా సహజీవనం చేస్తున్నారని తెలుస్తుంది. త్వరలో ఈ విషయాలన్నింటిపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది