HomecinemaIleana: ఆసుప‌త్రి బెడ్ పై ఇలియానా.. ఆహారం కూడా తిన‌లేని స్థితిలో ఉందా?

Ileana: ఆసుప‌త్రి బెడ్ పై ఇలియానా.. ఆహారం కూడా తిన‌లేని స్థితిలో ఉందా?

Telugu Flash News

Ileana: గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ పోకిరి సినిమాతో యువ‌త‌కు క‌ల‌ల రాణిగా మారింది.

టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి. అయితే ప్రస్తుతం ఈ అందాల సుందరి అరకొర చిత్రాలు చేస్తూ.. ఫ్రెండ్స్ తో ఫారెన్ ట్రిప్పులో బిజీగా ఉంటోంది.

ఫారెన్ వెకేషన్స్ లో హుషారుగా ఉండే ఇలియానా తాజాగా అస్వస్థతకి గురైంది. తాను ఆసుపత్రి పాలైన విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది.

ఇలియానా త‌న అనారోగ్యానికి సంబంధించిన కార‌ణం అయితే చెప్ప‌లేదు కాని ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో ఆసుపత్రిలో చేరిందట‌. వైద్యులు ఆమెకి మూడు సెలైన్ బాటిల్స్ ఎక్కించారట.

ఇంతలా ఇలియానా అనారోగ్యానికి గురి కావడానికి కారణం ఏంటి అంటూ ఆమె ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. బహుశా ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.

వైద్యులు ఇచ్చిన ట్రీట్మెంట్ తో తాను ప్రస్తుతం కోలుకున్నానని ఇలియానా మరో పోస్ట్ లో పేర్కొన‌డంతో అభిమానులు రిలాక్స్ అయ్యారు.

-Advertisement-

also read :

ఉక్రెయిన్‌ కు యుద్ధ విమానాలు సరఫరా నిలిపివేస్తున్నట్లు జో బైడెన్‌ సంచలన ప్రకటన

Varla Ramaiah : ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారు.. ఏపీ సర్కార్‌పై టీడీపీ ఆరోపణలు

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News