HomecinemaIleana: బిడ్డ తండ్రి ఎవ‌రో చెప్ప‌కుండా.. ఇలా వ‌రుస బేబి బంప్ ఫోటోల‌తో ఇలియానా ర‌చ్చ‌

Ileana: బిడ్డ తండ్రి ఎవ‌రో చెప్ప‌కుండా.. ఇలా వ‌రుస బేబి బంప్ ఫోటోల‌తో ఇలియానా ర‌చ్చ‌

Telugu Flash News

Ileana: గోవా అందం ఇలియానా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు..‘దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అమ్మ‌మ‌డు కొన్నాళ్లు టాప్ హీరోయిన్‌గా రాణించింది. ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకంటూ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అంతేకాదు ఇలియానా నడుమందాలతో తెలుగు యువతకు నిద్ర లేకుండా చేసింది. మహేష్, పూరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. తెలుగు ఇండ‌స్ట్రీలోని టాప్ స్టార్స్ అంద‌రితో క‌లిసి ప‌ని చేసింది. తెలుగులో నటిస్తూనే.. హిందీ సినిమాలపై కన్నేసిన ఇలియానా అక్కడ కూడా ప‌ర్వాలేద‌నిపించింది . ‘బర్ఫీ’, ‘పటా పోస్టర్ నిఖలా హీరో’, ‘మెయిన్ తెరా హీరో’, ‘రుస్తుం’ లాంటీ సినిమాలు ఇలియానికి హిందీలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

ఇటీవ‌ల ఇలియానా ప్రేమ‌, పెళ్లి, ప్ర‌గ్నెన్సీ విష‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తుంది. గోవా బ్యూటీ ఒకప్పుడు విదేశీ ఫోటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. ఆ తరువాత కొన్ని రోజుల పాటు సింగిల్‌గానే ఉన్నట్టు కనిపించిన త‌ర్వాత బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా సోదరుడితో ప్రేమలో ఉందనే వార్తలు గుప్పుమ‌న్నాయి. ఇక చివరకు ఇలియానా తాను తల్లి కాబోతోన్నాను అంటూ ప్రకటించి అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 18న ఇలియానా ఓ పోస్ట్ వేయ‌గా, . అందులో రెండు ఫోటోలను షేర్ చేసింది. మామా (తల్లి) అంటూ ఓ లాకెట్‌ను షేర్ చేయ‌డంతో పాటు అడ్వెంచర్ బిగిన్స్ అని ఓ బుల్లి టీషర్ట్‌ను కూడా షేర్ చేసింది. త్వరలోనే రాబోతోన్నాడు.. చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఉన్నాను అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది ఇలియానా.

పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందనే వార్తలు వైరల్ అవుతున్న నేప‌థ్యంలో ఈ అమ్మ‌డు వ‌రుస బేబి బంప్ పిక్స్ షేర్ చేస్తూ షాకులు ఇస్తుంది. తాజాగా బ్లాక్‌ టైట్‌ ఫిట్‌ ధరించి బేబీ బంప్‌ షో చేయ‌గా, ఈ ఫొటోల‌లో తన చిన్నారి కడుపులో పెరుగుతున్నందున దాన్ని చూసుకుని తెగ మురిసిపోతుంది ఇలియానా. అంతేకాదు నవ్వులు చిందిస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. ఇందులో బంప్‌ అలెర్ట్ అంటూ పోస్ట్ కి కామెంట్‌ పెట్టింది ఇలియానా. ఫొటోల‌లో ఇలియానా బరువెక్కి బొద్దుగా కనిపిస్తుంది. క్యూట్‌ ఫేస్‌ ఆకట్టుకునేలా ఉండ‌గా, మరోవైపు బ్లాక్‌ డ్రెస్‌లో యమ హాట్‌గా కూడా క‌నిపిస్తుంది. మొత్తంగా రెండు రకాలుగా గోవా బ్యూటీ ర‌చ్చ చేస్తుంద‌ని చెప్పాలి. మధ్యలో ఇలియానా కొన్ని బికినీ ఫోటోలు షేర్ చేయ‌గా, అందులో గర్భం కనిపించలేదు.ఈ పిక్స్ లో మాత్రం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News