కొంతమంది అమ్మాయిలు మాట్లాడేటప్పుడు వారికి మీరంటే ఇష్టమో లేదో తెలియ ఇబ్బంది పడుతుంది. ఒక అమ్మాయి నిజంగా ఇష్టపడితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయ్.
వాటిని గమనిస్తే తను మిమ్మల్ని ఇష్టపడుతుందని మీరు తెలుసుకోవచ్చు.
ఒక మనిషి 18 రకాలుగా నవ్వుతారని ప్రముఖ మానసిక శాస్త్రవేత్త చెప్పారు. ఈ 18 రకాల్లో ఒక రకంగా కేవలం మనకు ఇష్టమైన వాళ్లని చూసినప్పుడు నవ్వుతామని అంటారు. నవ్వినప్పుడు కళ్ల పక్కన చిన్ని సొట్ట కనిపిస్తే అది ఇష్టమైన వారిని చూసి నవ్వినట్టని అనుకోవచ్చు. కళ్ల దగ్గర ముడతలు వచ్చినట్టు నవ్వితే తన మిమ్మల్ని మనస్పూర్తిగా ఇష్టపడుతుందని అర్థం.
కళ్లు ఒక మనిషిలో ఎలాంటి భావాలు వున్నాయో చెప్పేస్తాయ్. మిమ్మల్ని చూస్తున్నప్పుడు నార్మల్‌గా కాకుండా చాలా ఇంట్రెస్టింగ్‌గా గనుక చూస్తే మీరు తనకు చాలా ఇంట్రెస్ట్ అని అర్థం చేసుకోవచ్చు. మీతో మాట్లాడితే తన వాయిస్ చాలా వేగంగా వుండడం లేదా హై పిచ్‌తో గనక వుంటే అప్పుడు మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతుందని అర్థం చేసుకోవచ్చు.
బాడీ ల్యాంగ్వేజ్ కూడా మీపై తన ఇష్టాన్ని తెలియజేస్తుంది. మీరు ఎలా నిలబడతారో అలా నిలబడ్డం, ఎలాంటి దుస్తులు వేసుకుంటారో అలా వేసుకోవడం, ఎలాంటి చెప్పులు వేసుకుంటారో అలాంటివి వేసుకోవడం, మీకు ఇష్టమైన ఆహారాన్ని తినడం ఇలా మీకు నచ్చిన పనులను చేస్తే ఆ అమ్మయి మిమ్మల్ని ఇష్టపడుతుందని అర్థం చేసుకోవచ్చు.
తన చేతులు కూడా మిమ్మల్ని ఇష్టపడుతుందా లేదా చెబుతాయ్. మీతో మాట్లాడుతున్న సమయంలో తన చేతులు వెంట్రుకలను సరిచేసుకుంటూ వుంటే, పెదవులపై చేతి వేళ్లను పెడుతూ వుంటే, లేదా తన చేతులను బ్యాక్ పాకెట్‌లో పెట్టుకుంటూ వుంటే అప్పుడు ఆ అమ్మాయ్ మిమ్మల్ని ఇష్టపడుతుందని అర్థం చేసుకోవచ్చు. ఒక అమ్మాయి తరచూ తన చేతులను టచ్ చేస్తూ వుంటే, తలపై కొట్టడం, భుజం పై చేతులు వేసి మాట్లాడుతూ వుంటే అప్పుడు తను మిమ్మల్ని ఇష్టపడుతుందని అర్థం చేసుకోవాలి.
మిమ్మల్ని ఇష్టపడితే మీకు నచ్చిన పనులను చేస్తుంది. మీకు ఏమిష్టమో అడిగి తెలుసుకుంటుంది. వాటిని తన జీవితంలో లైఫ్‌స్టైల్లో భాగం చేసుకుంటుంది. ఇలా మిమ్మల్ని సంతోషపర్చడానికి ప్రయత్నిస్తుంది.
మీరు మాట్లాడినప్పుడు లేదా జోక్ చేసినప్పుడు అమ్మాయి గనుక ఎక్కువగా నవ్వడం చేస్తే మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు. మీరు చెప్పే ఏ విషయమైనా చాలా ఆసక్తిగా వింటుంది. మీతో మాట్లాడటానికి కాారణాలను వెతుక్కుంటుంది. ఎలాగైనా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది.
సోషల్ మీడియాలో వుంటే మీరు చేసే పోస్టులకు లైకులు, కామెంట్లు ఇస్తుంది. మీరు ఎప్పుడ యాక్టివ్ వుంటారో, అన్ యాక్టివ్ వుంటారో తెలుసుకుంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా మిమ్మల్ని సహాయం అడుగుతుంది. మీరు కాల్ చేయకున్నా తనే మీకు కాల్ చేస్తుంది. మీరు ఎలా వున్నారో అడిగి తెలుసుకుంటుంది.
మీరు దగ్గరగా వున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతుంది. మీరు దూరమైతే చాలా బాధపడుతుంది. మీ దూరాన్ని తను తట్టుకోలేదు. మీరు చెప్పే విషయాలను మరిచిపోకుండా గుర్తుంచుకుంటుంది. మీరు దగ్గర వుంటే మిమ్మల్నే చూడ్డానికి ప్రయత్నిస్తుంది.