ICC: దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ సెమీస్ కి ఇండియా, పాకిస్తాన్ వెళ్లడం అందరిలో ఒక ఎగ్జైట్‌మెంట్ క్రియేట్ అయింది. సెమీస్ గెలిచి ఈ రెండు జట్లు ఫైనల్‌కి వస్తాయా.. అది జరిగితే మాత్రం క్రికెట్ ప్రేమికులకి మంచి మజా దొరకడం ఖాయం అని ఎవరి లెక్కలు వారు వేస్తున్నారు. అయితే పాక్ ఇండియా సెమీస్‌కి రావడం వెనక ఐసీసీ హస్తం ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అందుకు కారణాలు కూడా చూపుతున్నారు. మెగా టోర్నీలో గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీఫైనల్ చేరగా.. గ్రూప్-2 నుంచి భారత్, పాకిస్థాన్‌లు వచ్చిన విషయం తెలిసిందే. చివరి వరకు సెమీస్ రేసులోనే లేని పాకిస్థాన్.. నెదర్లాండ్స్ సంచలన విజయంతో నాకౌట్ బెర్త్ కన్‌ఫాం చేసుకుంది.
ఇది ఎంత వరకు నిజం..
అయితే ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు జరిగిన కెప్టెన్‌ల ఫొటోషూట్‌కు సెమీస్ బెర్త్‌లు దక్కించుకున్న జట్లకు లింక్ ఉండటంతో ఇప్పుడు ఈ విషయం హాట టాపిక్ గా మారింది. వరల్డ్ కప్ ముందు ఫొటో షూట్ జరగగా, అందులో ఆరోన్ ఫించ్ సెల్ఫీ తీయగా.. అందులో అందరూ కెప్టెన్లు ఫోజిచ్చారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందువరుసలో ఉండగా నెదర్లాండ్స్, పాకిస్థాన్, న్యూజిలాడ్, ఇంగ్లండ్ కెప్టెన్లు వెనుక వరసలో ఉన్నారు. ఇక ఫొటోలోని బ్యాంక్ గ్రౌండ్‌లో ఓ పోస్టర్ ఉండగా.. అందులో మెగాటోర్నీలో పాల్గొనే అన్నిదేశాలు జెండాల చిహ్నాలు మనకు కనిపిస్తున్నాయి.
అయితే సెమీస్‌లో తలపడే జట్ల జెండాల చిహ్నాలు పక్కపక్కనే ఉండడం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది.. తొలి సెమీఫైనల్లో తలపడే న్యూజిలాండ్ పాకిస్థాన్ చిహ్నాలతో పాటు రెండో సెమీ ఫైనల్లో తలపడే భారత్- ఇంగ్లండ్ జెండాల గుర్తులు పక్కనే ఏర్పాటు చేసి ఉండడంతో ఐసీసీ ముందే ఇలా ప్లాన్ చేసిందా అందరు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని, మాకు రావాల్సిన ఐదు పెనాల్టీ పరుగులు రాలేదని బంగ్లా క్రికెటర్ నురుల్ హసన్ చేసిన కామెంట్లు, పెద్ద దుమారమే రేపాయి. అదీకాకుండా విరాట్ కోహ్లీ నో బాల్‌కి అప్పీలు చేసిన వెంటనే అంపైర్లు, నో బాల్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్ అయ్యిందనే విషయం తెలిసిందే.