న్యూస్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ (anasuya) ప్రస్తుతం బుల్లి తెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వెండితెర సినిమా అవకాశాలతో బిజీగా ఉంది.
కెరీర్ పరంగా మంచి విజయాలు సాధించిన అనసూయ తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉంది. మరియు ఆమె ప్రేమ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అనసూయ, తన భర్త సుశాంక్ మరియు ఇద్దరు పిల్లలతో చాలా సంతోషంగా జీవిస్తోంది. జూన్ 4 న అనసూయ పెళ్లి రోజు కావడంతో తన భర్తతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
ఈ సందర్భంగా అనసూయ తన భర్తతో తనకున్న ప్రేమ గురించి చెబుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ రాసింది. నువ్వు నాకు రాసిన మొదటి ప్రేమలేఖ నాకు ఇంకా గుర్తుంది. 2001 జనవరి 23 న మీరు న్యూఢిల్లీలోని ఆడిటోరియంలో నాకు ఒక లేఖ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ లేఖకు నేను సమాధానం ఇవ్వలేదని నాకు తెలుసు. అందుకే ఇప్పుడు ఇస్తున్నాను.
ప్రియమైన నిక్కూ,
నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు. నువ్వు నా కోసం ఎన్నో త్యాగాలు చేశావు. ఎన్ని అవమానాలు ఎదురైనా మన ప్రేమ మందిరాన్ని నిలబెట్టినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడిప్పుడే మనం కలిసి తెలివిగా ఎదుగుతున్నాము. ఇన్నాళ్లూ నువ్వు నన్ను ఎలా సహించావో నాకు అర్థం కావడం లేదు, నేను నిన్ను ఎలా సహించానో నాకు తెలియదు.
నా జీవితాంతం నేను బాధించాలనుకునే ఏకైక వ్యక్తి నువ్వు. మనమిద్దరం పర్ఫెక్ట్ కపుల్ కాదని తెలుసు , మనమిద్దరం మూర్ఖులమని నాకు తెలుసు. కొన్నిసార్లు మనము ఒకరినొకరు లేకుండా ఉండలేము. మన పెళ్లిరోజు ని డేట్ లా చేసినందుకు ధన్యవాదాలు.. పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నా’ అంటూ తన భర్త గురించి అనసూయ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read more news :
Anasuya Hot in bikini photos and Video 04.06.2023.. బికినీలో సినీ నటి అనసూయ