Telugu Flash News

Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావుపై అసత్య ప్రచారాల వెనుక ఆ రాజకీయ నేత అభిమానులు?!

kota srinivasa rao

టాలీవుడ్‌లో సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao)పై గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి అసత్య ప్రచారం మొదలు పెట్టారు. ఆయన మృతి చెందారనే ప్రచారం కలకలం రేపింది. తాను క్షేమంగానే ఉన్నానని స్వయంగా కోట శ్రీనివాసరావు ఓ వీడియో విడుదల చేయడంతో ఇది అసత్య ప్రచారమని క్లారిటీ వచ్చింది. కోట తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఆయన ఆరోగ్యం గురించి వాట్సప్‌ గ్రూపులు, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పుకార్లు విపరీతంగా స్ప్రెడ్‌ అయ్యాయి. కోట మృతి చెందారని కొంత మంది పోస్టులను ఫార్వర్డ్‌ చేశారు. దీంతో చాలా మంది అభిమానులు ఆందోళన చెందారు. అయితే, ఈ ప్రచారంలో వాస్తవం లేదని కోట స్పష్టం చేశారు.

ఈ మేరకు పలువురు తెలుగు సినిమా జర్నలిస్టులతో కోట శ్రీనివాసరావు ఫోన్లో సంభాషించారు. తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నమ్మవద్దని అభిమానులు, ప్రేక్షకులను కోట శ్రీనివాసరావు కోరారు. అయితే, ఈ వార్తల వ్యాప్తి వెనుక ఓ రాజకీయ నేత అభిమానులు ఉన్నారని తెలుస్తోంది. గతంలో కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతోనే ఆ నేత అభిమానులు కోటపై కక్షపెట్టుకొని ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని సమాచారం.

ఇక వీడియోలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తెల్లవారితే ఉగాది.. పండగ రోజున ఏం చేద్దామని ఆలోచిస్తున్నానన్నారు. ఎవరో సోషల్ మీడియాలో ‘కోట దుర్మరణం’ అని వేశారట.. దాంతో ఉదయం నుంచి ఒక్కటే ఫోన్లు వస్తున్నాయని కోట తెలిపారు. ఇప్పటికి తాను కనీసం 50 ఫోన్లు మాట్లాడానన్న కోట.. వ్యాను వేసుకుని పది మంది పోలీసులు వచ్చారని తెలిపారు.

పెద్దాయన మరణిస్తే ప్రముఖులు వస్తే సెక్యూరిటీ కావాలని వచ్చామని చెప్పారని తెలిపారు. ఇటువంటి వార్తలు నమ్మవద్దని మనవి చేస్తున్నానంటూ కోట విజ్ఞప్తి చేశారు. డబ్బు సంపాదించడానికి జీవితంలో చండాలపు పనులు బోలెడు ఉన్నాయని, మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దని కోరారు. ఇటువంటి పనులు అక్కర్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోట శ్రీనివాసరావు మృతి చెందారనే వార్త తొలుత వాట్సాప్ గ్రూపుల్లో స్టార్ట్‌ అయ్యింది. ఫార్వర్డ్ చేసిన సందేశాలను చూసిన కొంత మంది నిజమని నమ్మసాగారు. సోషల్ మీడియా పోస్టులు కూడా పెట్టసాగారు. అయితే, ఈ ప్రచారం వెనుక రాజకీయ అభిమానులు ఉన్నట్లు సమాచారం.

కొన్నాళ్ల క్రితం చిత్రసీమతో బలమైన సత్సంబంధాలు ఉన్న చెందిన రాజకీయ నేతపై ఇంటర్వ్యూలో కోట శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అది నచ్చని కొందరు అభిమానులు ఈ పుకార్లు సృష్టించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version