Navaratri Dhamaka: బిగ్ బాస్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న వారిలో షణ్ముఖ్, సిరి తప్పక ఉంటారు. సీజన్ 5లో నానా రచ్చ చేసిన ఈ జంట పాపులారిటీ తెచ్చుకోవడం ఏమో కాని అందరిచే నానా చీవాట్లు తిన్నారు. షణ్ముక్‌కు దీప్తి సునైనా.. సిరికి శ్రీహాన్ ఉండగా, వాళ్లు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు .
కాని బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లాక సిరి, షణ్ముఖ్ వ్యవహారం వేరే లెవల్‌కి వెళ్లింది. హౌజ్‌లోకి వెళ్లిన సమయంలో సిరి అమ్మగారు కూడా ఈ ఇద్దరి రిలేషన్షిప్ గురించి కాస్త తేడాగా మాట్లాడిన కూడా వీరిద్దరు రెచ్చిపోయి హగ్‌లు, కిస్‌లు ఇచ్చుకుంటూ రచ్చ చేశారు.
అలా బయటపెట్టేశాడు..
అయితే హౌజ్‌లో వీరు చేసిన రచ్చకు బయటకు వచ్చాక పెద్ద ప్రతిఫలమే దక్కింది. శ్రీహాన్ అంటే అన్నీ అణుచుకొని సిరితో ఉంటున్నాడు కాని, దీప్తి సునయన మాత్రం షణ్ముక్‌కి బ్రేకప్ చెప్పేసింది. ప్రస్తుతం అయితే ఎవరి లైఫ్స్ వారు చూసుకొని సంతోషంగా గడుపుతున్నారు.
ఇదిలా ఉంటే హైపర్ ఆది తాజాగా సిరి-షణ్ముఖ్‌ల వ్యవహారంపై అదిరిపోయే పంచ్ వేసి అందరు ఆశ్చర్యపోయేలా చేశాడు. నవరాత్రి ధమాకా పేరుతో ప్రత్యేకమైన షో ఒకటి ప్లాన్ చేయగా, ఆ షోకి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఈ ఈవెంట్ కి సీనియర్ హీరోయిన్ సంఘవి, ప్రేమ అతిథులుగా హాజరయ్యారు.
యాంకర్ రవి, సిరి, జ్యోతి, ఇతర బుల్లితెర నటులు ఈ షోలో పాల్గొనగా, హైపర్ ఆది ఎప్పటిలాగే ఒక్కొక్కరిపై కామెడీ పంచ్‌లు విసిరాడు. హైపర్ ఆది, సిరి కలసి ఓ స్కిట్ పెర్ఫామ్ చేయగా, ఇందులో వీళ్ళిద్దరూ తండ్రి కూతుళ్లుగా నటించారు.ఇందులో నాన్న నాకు రెండు రోజుల నుంచి బోర్ కొడుతోంది అని సిరి అంటుంది.
దాంతో నీకు రెండు రోజులకే బోర్ కొడితే.. ఇక వందరోజులు భరించే మా పరిస్థితి ఏంటి అన్నట్లుగా బిగ్ బాస్ గురించి పరోక్షంగా ఆది కామెంట్ చేశాడు. ఇక నేను బాగా ఫన్ చేశానుగా అని సిరి అంటే, ఫన్ మొత్తం షన్నూకే ఇచ్చావ్.. మాకేం మిగిలింది అని ఆది సెటైర్ వేస్తూ అందరి ముందు వాళ్ళిద్దరి వ్యవహారాన్ని బయట పెట్టాడు. దీంతో సిరి కాస్త సిగ్గు మొగ్గలేసింది.
watch hyper aadi siri promo here