Telugu Flash News

Hyderabad: ఓ యువతితో ప్రేమ, మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన వరుడు.. పెళ్లి పీటలపైనే ఆగిన వివాహం!

hyderabad crime news

Hyderabad news : ప్రేమ పేరుతో మోసపోతున్న యువతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. స్మార్ట్‌ ఫోన్లు, సోషల్‌ మీడియా ప్రభావంతో అమ్మాయిలను బుట్టలో వేసుకుంటున్న యువకులు.. అవలీలగా మోసం చేస్తున్నారు. ఈ తరహాలో అనేక ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఎంతగా అవగాహన కల్పించినా మోసపోతున్న వారి సంఖ్య తగ్గడం లేదు. తాజాగా ఓ యువతిని ప్రేమించి.. మరో యువతితో పెళ్లికి సిద్ధమైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.

ప్రస్తుతం మోసపోతున్న యువతుల్లో కొందరు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తనను ఓ యువకుడు మోసం చేసి మరో యువతి మెడలో తాళి కట్టడానికి రెడీ అవుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ యువతి.

ఈ నేపథ్యంలో ఎంటర్‌ అయిన పోలీసులు.. సినీ ఫక్కీలో పెళ్లి పీటలపై నుంచి వరుడిని అరెస్టు చేయడం గమనార్హం. అచ్చంగా తాళి కట్టేటప్పుడు అరెస్టు అయ్యాడు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

మొదట ఫ్రెండ్‌షిప్‌ అని మొదలు పెట్టిన యువకుడు.. తర్వాత ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడు. అతను చెప్పినవన్నీ నమ్మి సర్వస్వం అర్పించుకుంది యువతి. ఇద్దరిదీ ఒకే ప్రాంతం కావడంతో అతడిని పూర్తిగా నమ్మేసింది.

పెళ్లి చేసుకుంటాడని నమ్మేసి అర్థికంగానూ ఆదుకుంది. కానీ, ఆమె ఆశలను సమాధి చేస్తూ మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు ఆ యువకుడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దాంతో, పెళ్లి మండపంలోనే నిందితుడు పృథ్వీని పొలీసులు అరెస్ట్‌ చేశారు.

మరి కాసేపట్లో వివాహ తంతు జరుగుతుందనగా పృథ్వీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకోడానికి ముస్తాబవుతుండగా పృథ్వీకి షాక్‌ ఇచ్చారు పోలీసులు. రెండేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు బాధితురాలు తెలిపింది.

తనను ప్రేమ, పెళ్లి పేరు చెప్పి లోబర్చుకున్నాడని, దాంతో పాటు డబ్బు కూడా లాగేసుకున్నాడని, అన్ని విధాలుగా వాడుకున్నాడని యువతి వాపోయింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. పృథ్వీని అరెస్టు చేసి చీటింగ్‌, రేప్‌ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

also read :

Adah Sharma Latest Hot Photos, Images, stills 2023

Avinash Reddy : వివేకా హత్య కేసులో అవినాశ్‌ రెడ్డిపై సీబీఐ ప్రశ్నల వర్షం

Exit mobile version