how to take care of your neck skin : ముఖంమాత్రం నాలుగు సార్లు శుభ్రపరచుకొని మెడను వదిలేసే వారుంటారు. అలాంటి వారి మెడ నలుపుగా ఉంటుంది. అది అందాన్ని తగ్గిస్తుందిగా ! మరి పరిష్కారం ఏంటి ?
- మీ మెడ, కంఠం మాత్రం నల్లగా ఉంటే దోసకాయ గుజ్జును రాయండి చాలు. నలుపంతా పోతుంది.
- మీ మెడ, కంఠం పైన ముడతలుంటే మీగడలో నిమ్మరసం, పసుపు, తేనె కలిపి మసాజ్ చేయండి.
- కొబ్బరిపాలతో మర్దన చేస్తే చర్మం కాంతివంతమవుతుంది.
- మీ మెడ, కంఠం మరీ లావుగా ఉంటే వ్యాయామం చేస్తే సన్నబడుతుంది.
చక్కటి హారం అలంకరిస్తే మీరా లేక అది అందమైనదా అని ఇద్దరూ పోటీ పడాల్సిందే !