How to Stop Wasting Time : జాగ్రత్తగా దాచాననుకున్న వస్తువు ఎంత ఆలోచించినా ఎక్కడ పెట్టారో గుర్తు రాదు. రోజంతా గడిచిపోతుంది కానీ ఎంత వెదికినా దొరకదు. మీరలా కాకూడదు. అంటే ఏం శ్రద్ధ తీసుకోవాలి ?
- గుర్తుంచుకోవల్సిన కాగితాలన్నీ పెట్టుకోవడానికి ఒక స్థలం కేటాయించాలి.
- చెయ్యాల్సిన పనుల లిస్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకొని, పద్ధతి ప్రకారం చేసుకోవాలి.
- టిఫిన్, భోజనం, డిన్నర్, అన్నిటికీ ముందుగానే ‘మెనూ’ సిద్ధం చేసుకోవాలి.
- సరుకులు నెలకి సరిపడా ఒకేసారి తెచ్చుకుంటే టైమ్ కలిసి వస్తుంది.
- డబ్బాలపై స్టిక్కర్స్ అతికించుకుంటే ఏది ఎందులో ఉందని వెతుక్కునే పని తప్పుతుంది.
- కూరగాయలను ముందురోజే తరిగి ఫ్రిజ్లో పెట్టుకుంటే ప్రొద్దున పూట హడావిడి పడక్కర్లేదు.
- ఎక్కడి సామాను అక్కడ, ఎప్పటికప్పుడు సర్దుకుంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఎవరైనా వస్తున్నారన్నా సర్దేపని ఉండదు. వెతుక్కోవలసిన పని ఉండదు కాబట్టి ఎంతో సమయం కలిసి వస్తుంది.
- ఫొటోలు ఎక్కడెక్కడో పారెయ్యక ఆల్బమ్లో పెట్టుకుంటే అతిధులొచ్చినప్పుడు, మనం చూసుకోవాలనుకున్నప్పుడు కూడా అనువుగా ఉంటుంది.
- ఎక్కడికైనా వెళ్ళాల్సిన కార్యక్రమాలు ఉంటే ఆ తేదీలు రాసుకోవటానికి ఒక చిన్న పుస్తకం అందులో ఉంచండి.
- పనికిరాని పేపర్సును ఎప్పటికప్పుడు చెత్తబుట్టపరం చెయ్యండి.
- పాతగుడ్డలను పనివారికి ఇవ్వటమో, స్టీల్ సామానుకు మార్పిడి చేయటమో ఎప్పటికప్పుడు చెయ్యాలి.
- పేపర్లు ఎక్కువ రోజులు నిలువ చెయ్యకుండా నెలకొక సారైనా అమ్మెయ్యండి.
- సమాచారాలను అందించే పుస్తకాలను బుక్ షెల్ఫ్ ఉంచండి.
- మీరనుకోకుండా ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే ‘నోటి స్లిప్’లో నోట్ చేస్తే మీ వాళ్ళు మీ కోసం వెదుక్కోరు.
ఇలా చేసి చూడండి ! అప్పుడు మీరే చెబుతారు మీ సమయం ఎంత ఆదా అయిందో!
also read :
Rashmika Mandanna hot at Zee Cine Awards 2023 Photos and Videos
Kiara Advani hot at Zee Cine Awards 2023 Photos and Videos
-Advertisement-