ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే గుండెపోటుకు గురయ్యేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గుండె పోటు వచ్చేటప్పుడు అరగంట లేదా అంతకంటే ముందు ఛాతీలో నొప్పి ప్రారంభమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎడమ చేతిలోనూ నొప్పి వస్తుందట. ఆ వెంటనే విపరీతంగా చెమటలు పడతాయి. వీటిని వెంటనే గుర్తించకపోతే ప్రమాదంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. మహిళల్లో కంటే పురుషుల్లోనే గుండెపోటు ఎక్కువగా సంభవిస్తుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి.
1. మగవారిలో ఉండే అలవాట్లు, జీవనశైలే గుండెపోటుకు కారణమని తెలుస్తోంది.
2. ఆహార, విహారాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని నివారించుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
3. సిగరెట్ స్మోకింగ్ అలవాటు మనిషిని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. వీలైనంత త్వరగా మానుకోవాలి.
4. గుండెపోటు రాకుండా అడ్డుకొనేందుకు అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్, డయాబెటిస్, ఊబకాయం లాంటివి లేకుండా చూసుకోవాలి.
5. అన్నింటికంటే మించి శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండెపోటు వచ్చే ఆస్కారం ఎక్కువని వైద్యులు చెబుతున్నారు.
also read :
Taraka Ratna : తారకరత్న నటించిన చివరి చిత్రం ఏది.. ఎప్పుడు విడుదల కాబోతుంది..!
Prabhas: ఫ్యాన్స్ అసంతృఫ్తి… ప్రభాస్‌తో కార్టూన్ సినిమాలు తీస్తున్నారంటూ ఫైర్