ఇంట్లోనే టమాటా సాస్ (tomato sauce) ను తయారు చేసుకొని ఆరు నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు.
1. రెండు కేజీల టమాటాలు తీసుకోవాలి. వెల్లుల్లి రేకలు 15 అవసరం.
2. అల్లం మూడు అంగుళాల ముక్క, 5 ఎండుమిర్చి తీసుకోవాలి.
3. కిస్మిస్ అరకప్పు, యాపిల్ సిడర్ వెనిగర్ అరకప్పు అవసరం.
4. ఉప్పు టేబుల్ స్పూన్, ఆర్గానిక్ షుగర్ ఆరు టేబుల్ స్పూన్లు, సోడియం బెన్జోయేట్ పావు టీస్పూన్ తీసుకోవాలి.
5. టమాటాలు క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి తొక్క తీసేయాలి.
6. అల్లం, వెల్లుల్లి పొట్టు తీసేసి, ఎండు మిర్చిని కట్ చేసి గింజలు తీసేయాలి. కిస్మిస్‌ను క్లీన్ చేసి ఉంచుకోవాలి.
7. టమాటా ముక్కలు, అల్లం, వెల్లుల్లి, మిర్చి, కిస్మిస్, వెనిగర్, సాల్ట్, షుగర్ కుక్కర్‌లో వేసి నాలుగు విజిల్స్ వచ్చేదాకా చూడాలి.
8. మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. స్ట్రెయినర్‌లో వడపోయాలి. సోడియం బెన్జోయేట్ కలిపి నీటిని వేయాలి.
9. అనంతరం చల్లారిన తర్వాత క్లీన్‌గా శుభ్రం చేసుకున్న పాత్రలో వేసుకోవాలి. ఆరు నెలలు నిల్వ ఉంటుంది.
also read news :
Rishi Sunak : యూకే ప్రధానిగా వంద రోజులు పూర్తి.. ‘ధర్మం’ ప్రేరణగా కర్తవ్యం చేస్తున్నానన్న రిషి!
Rama Prabha: వాళ్లు నాకు భిక్షం వేయడం లేదు.. ప్రేమతో ఇస్తున్నారు..