Oats Fruit Salad |
ఓట్స్ ఫ్రూట్ సలాడ్ కోసం కావలసినవి :
ఓట్స్: 1/2 కప్పు,
పాలు : 1 కప్పు,
కస్టర్డ్ పౌడర్ : 2 టేబుల్ స్పూన్లు.
పండ్లు (యాపిల్, అరటిపండు, స్ట్రాబెర్రీ, .. వంటివి ఏదైనా) : 1 కప్పు,
చక్కెర లేదా తేనె : 2 టేబుల్ స్పూన్లు,
వెనిలా ఎసెన్స్ : 3 చుక్కలు.
ఓట్స్ ఫ్రూట్ సలాడ్ తయారీ విధానం:
ముందుగా ఓట్స్ ను ఒక పాత్రలో వేసి వేడినీరు పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్‌ను రెండు చెంచాల పాలు లేదా నీటిలో ముద్దలు లేకుండా కలపాలి. అప్పుడు పాలు వేడి చేయండి. మరుగుతున్న పాలలో కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా కలపాలి. కొద్దిగా చిక్కబడిన తర్వాత అందులో వెనీలా ఎసెన్స్, పంచదార వేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా చల్లార్చి ఫ్రిజ్‌లో ఉంచాలి. మీకు నచ్చిన పండ్లను చిన్న ముక్కలుగా కట్ చేసి, మెత్తగా చేసిన ఓట్స్ వేసి బాగా కలపాలి. తర్వాత చల్లారిన కస్టర్డ్ వేసి.. అన్నింటినీ బాగా మిక్స్ చేస్తే చల్లచల్లని ఓట్స్ ఫ్రూట్స్ సలాడ్ రెడీ. ఎంతో రుచికరం గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం .. టేస్ట్ చేయండి మరి.
also read :
Vada Recipe : బనానా క్యారెట్ వడ.. ఇలా చేసి చూడండి.. సూపర్ గా ఉంటుంది !
dry seeds laddu : డ్రై సీడ్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి!