Telugu Flash News

how to get soft feet : మీ పాదాలు మృదువుగా ఉండాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

How to Get Soft Feet

how to get soft feet : పాదాలు చాలా సున్నితమైనవి. ఈ భూమిమీద మనం నిలబడటానికి ఆధారం పాదాలే. ఇలాంటి అమూల్యమైన పాదాలను తెల్లగా మల్లెపూవులా మాసిపోకుండా పసిపాపలా చూసుకొనే బాధ్యత మీదే !

  1. పాదాలు చీరకుచ్చెళ్ళలో మూసుకుపోతుంటాయని, చెప్పులలో దాక్కుంటాయని అశ్రద్ధ వహించకూడదు.
  2. పాదాలు పగిలాయంటే అరనిముషం కూడా భరించలేం. అడుగు కూడా ముందుకు వేయలేం. దీనివల్ల మరో ప్రమాదం ఉంది. చీరలను చింపే శక్తి ఈ పగుళ్ళకి ఉందండోయ్ !
  3. పూజగదికి తప్ప మిగతా అన్నిచోట్లకి పాదాలకు చెప్పులు తోడు కావాలి. చెప్పులు పాదాలు భార్యాభర్తలులా అనుక్షణం వీడకుండా ఉంటేనే పాదాలు మృదువుగా, హాయిగా ఉండగలుగుతాయి.
  4. ముఖాన్ని శుభ్రం చేసుకున్నట్లే పాదాలకు కూడా స్నానం చేయించాలి. వీటిని రుద్ది. కడగాలి. చాలామంది అవి మావి కావన్నట్లు పట్టించుకోరు. అది తప్పు అని గ్రహించాలి.
  5. గోరింటాకు ముద్ద పాదాలకు పట్టిస్తే పగుళ్ళు తగ్గుతాయి.
  6. పగుళ్ళు పెరిగితే రక్తం కారే పరిస్థితి వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా గోరువెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మరసం లేదా గోరింటాకు వేసి పదినిముషాలు పాదాలు అందులో ఉంచి తరువాత ఒక శుభ్రమైన టవల్ తో తుడిచి వాటికి వాజ్ లైన్ రాయాలి. అలా చేస్తే పాదాల నొప్పులు, పోట్లు మాయం.
  7. పాదాలను ఆలివ్ ఆయిల్ తో మర్దన చేయాలి. దానితో రక్తప్రసరణ పెరిగి పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి.
  8. పాదాలకు సాక్స్ వాడితే రోజూ విరిసే పువ్వుల్లా ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంటాయి.
  9. నిద్రపోయేటప్పుడు పాదాల క్రింద దిండ్లు పెట్టుకోవాలి.
  10. పాదాలకి పగుళ్ళు మరీ ఎక్కువగా ఉంటే పది నిముషాలు నీటిలో నాననిచ్చి స్ట్రచర్ బ్రష్ తో రుద్దుకుంటే పగుళ్ళు పోయినట్లే ! చెప్పలేనంత రిలీఫ్ కూడా !
  11. మార్కెట్ లో రక్తప్రసరణ పెంచే ప్రత్యేకమైన చెప్పులు ఉంటాయి . చాలామంది వాటిని స్పెషల్ గా కొనుక్కొని మరీ వాడుతున్నారు. మీరూ వాడండి !

పాదాలు ముద్దిచ్చేస్తున్నాయా ? ముద్దిస్తానంటున్నారా? కానీయండి మరి!

మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం చదవండి

tips for healthy nails : మీ గోళ్లు ఆరోగ్యంగానే ఉన్నాయా..? గోళ్ళు శుభ్రంగా లేకపోతే ప్రమాదమే!

మీ చేతులు మృదువుగా, నాజూకుగా తయారవ్వాలంటే ఏం చేయాలి ?

శంఖం లాంటి కంఠం మీకుంటే ఎంత అందం? ఇలా చేసి చూడండి ..

 

Exit mobile version