Homerecipessweet corn veg rolls : స్వీట్‌ కార్న్‌ తో వెజ్‌ రోల్స్‌ చేసుకోండి.. భలే రుచి గా ఉంటుంది!

sweet corn veg rolls : స్వీట్‌ కార్న్‌ తో వెజ్‌ రోల్స్‌ చేసుకోండి.. భలే రుచి గా ఉంటుంది!

Telugu Flash News

sweet corn veg rolls

స్వీట్‌ కార్న్‌ వెజ్‌ రోల్స్‌ తయారీ కి కావలసిన పదార్థాలు

గోధుమ పిండి రెండు కప్పులు,
స్వీట్‌ కార్న్‌ అర కప్పు,
ఉల్లిపాయ చిన్నది,
క్యాప్సికమ్‌, క్యారెట్‌ తురుము అరకప్పు,
సోయా సాస్‌ పావు టీస్పూన్‌,
చిల్లీ సాస్‌ ఒక టీస్పూన్‌,
అజినమొటొ చిటికెడు,
మిరియాలపొడి చిటికెడు,
టమాటా సాస్‌ ఒక టీస్పూన్‌,
కొత్తిమీర తరుగు కొద్దిగా,
ఉప్పు తగినంత,
పచ్చిమిర్చి రెండు,
నూనె సరిపడా

స్వీట్‌ కార్న్‌ వెజ్‌ రోల్స్‌ తయారీ విధానం

గోధుమపిండిలో చిటికెడు ఉప్పు వేసి తగినంత నీళ్ళు పోసి చపాతీ పిండిలా తడిపి పక్కన పెట్టుకోవాలి. స్వీట్ కార్న్ ను ఆవిరి మీద ఉడికించాలి. బాణలిలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మెత్తబడే వరకు వేయించాలి. తర్వాత క్యారెట్, క్యాప్సికమ్ తురుము వేసి వేయించాలి. అన్నీ బాగా కలిపిన తర్వాత అందులో సోయాసాస్, చిల్లీసాస్, టొమాటో సాస్, తగినంత ఉప్పు, అజినమోటో, మిరియాల పొడి, కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాలు కలపాలి. రిజర్వ్ చేసిన పిండితో చపాతీలు చేయండి. వేడి వేడి చపాతీకి మధ్యలో కూర వేసి రోల్స్ లా చుట్టుకుంటే కార్న్ వెజ్ రోల్స్ రెడీ!

also read :

Horoscope in Telugu : ఈ రోజు రాశి ఫలాలు (05/09/2023)

Tulasi Seeds benefits : తులసి గింజలు.. అద్బుత ప్రయోజనాలు

-Advertisement-

bigg boss telugu 7 : మీ హీరోయిన్ సమంత ఎక్కడ?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News