రాజస్థాన్ ఖీమా బిర్యానీ కి కావాల్సిన పదార్థాలు :
బాస్మతి బియ్యం అరకిలో ,
మటన్ ఖీమా 500గ్రా
చికెన్ స్టాక్ 2 కప్పులు,
నెయ్యి 150గ్రా,
ఉల్లిపాయలు 2,
పెరుగు 6 టీ స్పూన్లు,
కారం 2టీ స్పూన్లు,
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2టీ స్పూన్లు,
లవంగాలు 5,
నిమ్మరసం : 3 టీ స్పూన్లు,
దాల్చిన చెక్క చిన్న ముక్క,
ఉప్పు తగినంత
రాజస్థాన్ ఖీమా బిర్యానీ తయారీ విధానం : చికెన్, కూరగాయలు, ఉప్పు, మిరియాలు కలిపి ఉడికించిన గుజ్జుతో చికెన్ స్టాక్ తయారు చేసుకొని ఉంచు కోవాలి. తర్వాత నీటిలో ఉప్పు కలిపి బియ్యాన్ని హాఫ్ బాయిల్ చేయాలి. నీళ్ళు ఒంపేసి ఆ సగం ఉడికిన అన్నాన్ని ఆరబెట్టు కోవాలి.
ఉల్లిపాయలు ముక్కలుగా తరుక్కోవాలి. ఇప్పుడు నెయ్యి వేడిచేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాలి. అవి సగం వేగాక లవంగాలు, దాల్చిన చెక్క వేసి దోరగా వేయించాలి. అవి వేగాక అల్లం, వెల్లుల్లి పేస్టు, ఖీమా కలిపి పదినిముషాలు ఉంచాలి. తర్వాత కారం, పెరుగు వేసి బాగా కలిపి మరో అయిదు నిముషాలు వేయించాలి. దీన్ని తీసి ప్రక్కన పెట్టు కోవాలి. ఇప్పుడు గిన్నెలో సగం అన్నాన్ని వేసి పైన ఖీమా వెయ్యాలి. పైన నిమ్మరసం పిండాలి. మళ్ళీ పైన మరికొంచెం అన్నాన్ని, కొంచెం ఖీమా వెయ్యాలి.
ఇలా అన్నాన్ని, ఖీమాని పొరలు పొరలుగా వేసుకోవాలి. చివరగా మాత్రం పైన అన్నం వచ్చేట్లు చూసు కోవాలి. ఆ పైన చికెన్ స్టాక్ ను కూడా పొరలా వేసి మూత పెట్టాలి. సన్నని మంట మీద అరగంట ఉడికించి దించుకోవాలి.
మరిన్ని వంటలు చేయండి :
గోవా ఫిష్ కర్రీ.. ఇలా చేసారంటే చాలా రుచిగా ఉంటుంది..