Telugu Flash News

ప్రాన్స్ కోకోనట్ ఫ్రై .. తయారు చేయండిలా..

prawns coconut fry

ప్రాన్స్ కోకోనట్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు : రొయ్యలు అరకిలో,

కొబ్బరి తురుము : 1500 గ్రా..   కోడిగుడ్లు : 6 , బ్రెడ్ స్లయిసెస్ 100 గ్రా..

మిరియాల పొడి – 2 చెంచాలు

ఉప్పు, నూనె : తగినంత

ప్రాన్స్ కోకోనట్ ఫ్రై తయారీ విధానం : రొయ్యలు తోకలు అలాగే ఉంచి, మిగిలిన పొలుసు ఒలిచి శుభ్రంగా కడగాలి. బ్రెడ్ స్లయిసెస్ ను చిదుముకొని కొబ్బరి తురుమును దానికి కలుపుకోవాలి. గుడ్లను గిలకొట్టుకొని మిరియాలపొడి ఉప్పు కలపాలి. ఇప్పుడు రొయ్యలను గుడ్డు సొనలో ముంచి, బ్రెడ్ స్లయిసెస్, కొబ్బరి తురుము మిశ్రమంలో దొర్లించాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఈ రొయ్యలను వేసి బ్రౌన్ రంగులోకి వచ్చే వరకూ వేయించాలి.

ఇవి అన్నంలోకాక, రొట్టెలలోకి కూడా బాగుంటాయి. సాయంత్రం సమయంలో స్నాక్స్ గా కూడా పెట్టవచ్చు.

నోరూరించే చికెన్ & వంకాయ కర్రీ.. ఇలా చేసి చూడండి

మలబార్ మీన్ బిర్యానీ.. ఒక్కసారి తిన్నారంటే ఇక మర్చిపోరు

Exit mobile version