Telugu Flash News

poha halwa : అటుకులతో హల్వా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

poha halwa

poha halwa

poha halwa

అటుకుల హల్వా (poha halwa) తయారీ కి కావాల్సిన పదార్థాలు :

అటుకులు: 1 కప్పు,
చక్కెర: 1 కప్పు,
నెయ్యి: 1/2 కప్పు,
యాలకుల పొడి చెంచా
జీడిపప్పు పలుకులు: 1/4 కప్పు,
కిస్మిస్: 1/4 కప్పు.

అటుకుల హల్వా తయారీ విధానం :

ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టి అటుకుల్ని వేసి దోరగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. వేడి తగ్గాక అటుకుల్ని మిక్సీలో వేసుకుని బరకగా పట్టుకోవాలి . కడాయిని స్టవ్ మీద మళ్లీ పెట్టుకుని పెద్ద రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని మిక్సీలో పట్టిన అటుకుల పొడిని ఒకసారి వేయించుకోవాలి . ఇందులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకుని ఉండలు కట్టకుండా చూసుకుని రెండు నిమిషాలయ్యాక 1 టేబుల్ స్పూను నెయ్యి, చక్కెర, యాలకుల పొడి వేసి కలుపుకుని దగ్గరకు అయ్యాక దింపేయాలి. మిగిలిన నెయ్యిలో జీడిపప్పు, కిస్ మిస్ ను వేయించుకుని హల్వాపైన వేసి బాగా కలపాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.

 

Exit mobile version