HomerecipesPanasa Pottu Pulihora curry : పనసపొట్టు, పులిహొర కూర

Panasa Pottu Pulihora curry : పనసపొట్టు, పులిహొర కూర

Telugu Flash News

Panasa Pottu Pulihora curry : తయారు చేయుటకు కావలసినవి 
పనసపొట్టు : పావుకిలో
చింతపండు : పెద్ద నిమ్మకాయంత
పసుపు : చిటికెడు
ఎండుమిర్చి : 6
పచ్చిమిర్చి : 6
పచ్చిశెనగపప్పు : 2 టీ స్పూన్లు
మినపప్పు : 2 టీ స్పూన్ల
ఆవాలు : అరస్పూను
ఉప్పు : తగినంత
కరివేపాకు : 4 రెబ్బలు
జీలకర్ర : చిటికెడు

Panasa Pottu Pulihora curry తయారు చేయు విధానం : ఒక గిన్నెలో అరలీటరు నీళ్ళు పోసి కాగనివ్వాలి. నీళ్ళు పొంగు వచ్చాక పనసపొట్టు అందులో వేసి సన్న సెగమీద మగ్గనివ్వాలి. నీరు ఇగిరే దాకా ఉంచి దించాలి. వెడల్పాటి పళ్ళెంలో ఆరబెట్టి, చల్లారనివ్వాలి.బాణాలీలో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, పచ్చి శెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో తాలింపు పెట్టాలి. పచ్చిమిర్చి చీలికలుగా తరిగి వేయాలి.

చింతపండు నానబెట్టి పులుసుపిండి ఉంచుకోవాలి. తాలింపు వేగాక పచ్చిమిర్చి వేసి వేగనిచ్చి చింతపండు పులుసు పొయ్యాలి. తర్వాత ఉప్పు వేసి ఉడకనివ్వాలి. బాగా చిక్కబడే వరకూ ఉంచాలి. పులుసు కుతకుత లాడుతూ పులిహోర పులుసులా తయారయ్యాక ఉడకబెట్టిన పనస పొట్టు పిండి అందులో వెయ్యాలి. అలా సన్నసెగ మీద అలా ఒక పది నిముషాలపాటు మగ్గనివ్వాలి. కూర పొడి పొడిగా తయారయ్యేదాకా ఉంచి దించాలి.

also read :

moral stories in telugu : అబద్ధం ఆడరాదు.. ఆడితే నష్టం తప్పదు

Shriya Saran with Daughter Radha Photoshoot | Sinjita Basu Photography

-Advertisement-

Horoscope (9-3-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News