మసాలా పూరీ (masala poori) కి కావాల్సిన పదార్థాలు :
- క్యారెట్ తురుము – ఒక కప్పు
- గరం మసాలా – 2 టీ స్పూన్
- కొత్తిమీర – కొద్దిగా
- ఉప్పు – తగినంత
- గోధుమపిండి – 2 కప్పులు
- నూనె – 2 కప్పులు
మసాలా పూరీ (masala poori) తయారు చేయు విధానం :
గోధుమపిండిలో ఉప్పు వేసి కాస్త గట్టి ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. తురిమిన క్యారెట్లు నీళ్లు పిండి అందులో మసాలా, ఉప్పు, కొత్తిమీర కలిపి ఉంచుకోవాలి.గోధుమపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.ఒక్క ముద్దను కొద్దిగా ఒత్తి పురీ లా చేసుకోవాలి. అందులో మసాలా కలిపిన క్యారెట్ తురుమును పెట్టి అన్ని వైపుల నుండి చుట్టి ఉండలా చేయాలి. ఈ మసాలా ఉండను పూరి లాగా వత్తి నూనెలో వేయించాలి.ఈ పూరీలను కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది.