గోవా ఫిష్ కర్రీ తయారీ కి కావాల్సిన పదార్థాలు :
చేపముక్కలు – 10, ఉల్లిపాయలు -2 , పచ్చిమిర్చి – 6, పచ్చికొబ్బరి తురుము – 5 కప్పులు,
టొమోటాలు – అరకిలో , పసుపు : 1 టీ స్పూను, నిమ్మరసం : 6 టీ స్పూన్లు, పండు మిరపకాయలు 6 ,
ధనియాలు : 4 టీ స్పూన్లు , జీలకర్ర 2 టీ స్పూన్లు, మిరియాలు • 2 టీ స్పూన్లు , నూనె : 2 టీ స్పూన్లు ,
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 4 టీ స్పూన్లు , చింతపండు : కొద్దిగా కొత్తిమీర, ఉప్పు – తగినంత
గోవా ఫిష్ కర్రీ తయారీ విధానం :
చేపముక్కలను పసుపువేసి శుభ్రంగా కడగాలి. తరువాత ఉప్పు, నిమ్మరసం కలిపి ఓ గంట సేపు ప్రక్కన ఉంచాలి. ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలను కలిపి పొడి చేసుకోవాలి. చింతపండును నీళ్ళలో నానబెట్టాలి. బాణలీలో నూనె వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి ఉంచుకున్న పొడిని వేసి పది నిముషాలు వేయించాలి. అవి వేగాక నాలుగు కప్పుల నీళ్ళు పోసి మరగ నివ్వాలి.
నీళ్ళు మరుగుతున్నప్పుడు కొబ్బరి తురుము చేపముక్కలు వేసి అయిదు నిముషాలు ఉంచి చింతపండు రసం పిండి అందులో పోసుకొని మూత పెట్టాలి. సన్నని మంట మీద ఇరవై నిముషాలు ఉడికించాలి. ఈలోపు టమోటాలు, పచ్చిమిర్చి చిన్నముక్కలుగా తరుక్కోవాలి. మిశ్రమం చిక్కబడ్డాక టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. కాసేపు ఉంచి దించేసి కొత్తిమీర చల్లుకోవాలి.
మరిన్ని వంటలు చేయండి :
ప్రాన్స్ కోకోనట్ ఫ్రై .. తయారు చేయండిలా..
మలబార్ మీన్ బిర్యానీ.. ఒక్కసారి తిన్నారంటే ఇక మర్చిపోరు
నోరూరించే చికెన్ & వంకాయ కర్రీ.. ఇలా చేసి చూడండి