Banana Carrot Vada Recipe :
బనానా క్యారెట్ వడ తయారీ కి కావలసిన పదార్థాలు:
అరటికాయ : ఒకటి,
క్యారెట్ తురుము: ఒక కప్పు,
బియ్యప్పిండి: ఒక కప్పు,
ఉల్లిపాయ ముక్కలు: ఒక కప్పు.
వెల్లుల్లి రెబ్బలు: ఐదు,
పచ్చిమిర్చి: ఆరు,
జీలకర్ర: ఒక టీస్పూన్,
నూనె: వేయించడానికి సరిపడా,
కొత్తిమీర తరుగు: కప్పు,
ఉప్పు: రుచికి సరిపడా
బనానా క్యారెట్ వడ తయారుచేసే విధానం:
ముందుగా అరటికాయను పొట్టుతో కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఉడికించిన అరటికాయ తొక్క తీసి ముక్కలుగా కోసి మెత్తగా చేయాలి. క్యారెట్ తురుము మరియు తగినంత బియ్యం పిండి వేసి కలపాలి. ఈ మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ తో పాటు తగినంత ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి పేస్ట్ లా కలపాలి. ఆ తరవాత ముందుగా తయారుచేసుకున్న పిండి మిశ్రమాన్ని వడల్లా వేసి నూనెలో వేయించాలి. రుచికరమైన బనానా క్యారెట్ వడ సిద్ధం.
also read :
dry seeds laddu : డ్రై సీడ్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి!