మన శరీరంలోని జీవక్రియలో కాలేయం (Liver) ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో అతి పెద్ద అవయవం కూడా కాలేయమే. జీవితాంతం పెరిగే ఏకైక అవయవం కూడా కాలేయం. మనం తీసుకునే ఆహారం మరియు మందులలో విషపదార్థాలను నిల్వ చేసుకోవడం ద్వారా కాలేయం శరీరానికి హాని కలగకుండా కాపాడుతుంది. ఈ ముఖ్యమైన కాలేయానికి ఏదైనా చిన్న నష్టం జరిగిన వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.ఎటువంటి లక్షణాలు లేకుండా కాలేయం దెబ్బతింటుంది.
కలుషిత నీరు తాగడం, ఆహారం తీసుకోవడం, మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఉదరం యొక్క కుడి ఎగువ మూలలో లేదా పక్కటెముక క్రింద కుడి వైపున నొప్పి కాలేయం దెబ్బతినడానికి ఒక లక్షణంగా పరిగణించాలి.
మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయడం వల్ల కొవ్వు, చక్కెర మరియు ప్రోటీన్ల శాతాన్ని నిశితంగా నియంత్రించడం, రక్తాన్ని శుద్ధి చేయడం, జీర్ణక్రియకు సహాయపడే పిత్త ద్రవం ఉత్పత్తి, విటమిన్లు మరియు ఐరన్ వంటి పోషకాలను నిల్వ చేయడం, ఆహారాన్ని శక్తిగా మార్చడం, శరీరంలోని వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రించడం, రక్తం గడ్డకట్టడం మరియు గాయం నయం చేయడం, కాలేయం ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడం వంటి అనేక ముఖ్యమైన బాధ్యతలను నిర్వహిస్తుంది.
90 శాతం కాలేయం చెడిపోయినా ఒక్క పట్టాన వ్యాధి లక్షణాలు కనిపించవు. కాలేయం దెబ్బతినడం వల్ల కాళ్ళలో వాపు మరియు కాలేయ ఫైబ్రోసిస్‌కు కారణమవుతాయి. చర్మం పసుపు రంగులోకి మారితే, కళ్ళు లేత పసుపు రంగులోకి మారితే, అది కామెర్లు అని నిర్ధారించాలి.
కాలేయాన్ని ఎలా కాపాడుకోవాలి..?
- స్ట్రీట్ ఫుడ్, గప్‌చుప్ లు, టీ, కాఫీ, బిస్కెట్లు, ఐస్‌క్రీమ్‌లు, బేకరీ ఫుడ్, బర్గర్‌లు, పిజ్జాలు, మీట్ వంటి వాటి వల్ల కాలేయం దెబ్బతింటుంది.
- మందులను వీలైనంత తక్కువగా వాడాలి. అలాగే వైద్యుల సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి.
- వంటకు నాణ్యమైన నూనెలను మాత్రమే వాడాలి. ఒకసారి వాడిన నూనెలను పదే పదే వాడినా కాలేయం పాడైపోయే ప్రమాదం ఉంది.
- మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంత వరకు మద్యం సేవించడం మానేయడం మంచిది.
- ఆహారాన్ని సరిగ్గా ఉడికించకుండా తినకూడదు. ఉడకని ఆహారం తీసుకోవడం వల్ల కాలేయంపై భారం పెరుగుతుంది.
- రాత్రి త్వరగా నిద్రపోవడం, ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోండి.
- మీరు నిద్రలేవగానే, మీరు మీ కాలకృత్యాలు తీర్చుకోవాలి. లేదంటే కాలేయంలో వ్యర్థాలు పెరుగుతాయి.
- ఉదయం అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అతిగా తినకూడదు. ఆహారాన్ని ఎక్కువగా జీర్ణం చేయడం వల్ల కాలేయం మీద ఒత్తిడి ఏర్పడి అది పాడైపోతుంది.
- కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే వెల్లుల్లి, బీట్‌రూట్, క్యాలీఫ్లవర్, బ్రకోలీ, క్యారెట్, బంగాళదుంపలు, యాపిల్స్‌తో పాటు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ రెగ్యులర్ డైట్‌లో భాగం చేసుకోవాలి.
- కాలేయ అభివృద్ధికి ఉపయోగపడే పీచు, పొటాషియం, ఫ్లేవనాయిడ్లు మరియు ఫైటోన్యూట్రియెంట్లను అందించే ఉల్లిపాయను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి. ద్రాక్ష పండ్లను ఎక్కువగా తినండి.
also read :
Liver problems : ఈ 7 సంకేతాలు కనిపిస్తున్నాయంటే మీ కాలేయం ప్రమాదంలో ఉన్నట్టే…
Mental Health : మానసిక ఆరోగ్యానికి కూడా డైట్ .. పరిశోధనలు ఏమి చెబుతున్నాయి?