Telugu Flash News

పిల్లల్లో ఏకాగ్రత పెంచడం ఎలా? జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి 7 మార్గాలు..

శరీరాన్ని కదిలించే ఆటలు ఆడకపోవడం ఇంకా ఫోన్ లేదా టివి ఎక్కువగా చూడటం వల్ల పిల్లల్లో ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది.

“మా బాబుని 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం చదివించడం నాకు కష్టంగా ఉంది. తనకి ఎప్పుడూ విరామం కావాలి. అతనికి బాగా చదివే అలవాటు ఉంది. అయితే, తనకు విజువల్స్ లాంటివి నచ్చుతాయని నాకు తెలుసు. కానీ 30-నిమిషాల విజువల్స్ చూసినప్పటికీ, ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టడానికి తను చాలా కష్టపడుతున్నాడు అని గుర్తించాను”. 

ఇది చాలా మంది తల్లులు అనే మాటలు కారణం స్క్రీన్ టైం పెరగడం లేదా అలసిపోయేలా ఆటలు ఆడకపోవడం.

పిల్లల ఏకాగ్రత శక్తిని పెంచడంలో సహాయపడే కొన్ని టిప్స్

1. గాడ్జెట్ వాడకాన్నీ తగ్గించండి: గాడ్జెట్‌లు పిల్లల ఏకాగ్రతకు ఆటంకం కలిగిస్తాయి. దానిబదులు ఆహ్లాదకరమైన క్రీడలలో పాల్గొనేలా ప్రోత్సహించండి, క్రీడలు పిల్లలను క్రమశిక్షణలో ఉంచడంలో సహాయపడతాయి మరియు ఏకాగ్రతను పెంచడంలో కూడా సహాయపడతాయి.

2. బోర్డ్ గేమ్‌లు: వారానికి రెండు రోజులు అయినా, వారిని ఏదో ఒక క్రీడలో పాల్గొననివ్వండి , బోర్డ్ గేమ్‌లను పరిచయం చేయండి. పిల్లల ఏకాగ్రతను పెంపొందించడానికి చైల్డ్ సైకాలజిస్ట్/నిపుణులు బోర్డ్ గేమ్‌లను సిఫార్సు చేస్తారు.

3. DIY క్రాఫ్ట్స్‌లో పాల్గొనండి :  క్రాఫ్ట్‌లు మీ పిల్లలను ఎంగేజ్ చేయడానికి మంచి మార్గం. కొత్తగా ఏదైనా ప్రయత్నించండి. మీకు సహాయం చేయడానికి ఆన్‌లైన్‌లో బ్లాగ్స్ మరియు వీడియోలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలను చాలా వరకు స్వయంగా చేయనివ్వండి.

4. అవుట్‌డోర్ గేమ్ లేదా యాక్టివిటీ లాంటివి ప్రోత్సహించండి : తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటే పాల్గొనే లాంటి ఆటలు లేదా ఏమైనా ఆక్టివిటీ లాంటివి అయితే పిల్లలకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.

5. మెమరీ గేమ్‌ : మీ పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడానికి ప్రయాణిస్తున్నప్పుడు మీ పిల్లలతో మెమరీ గేమ్‌లలో ఆడండి. ఈ గేమ్‌లు ఏకాగ్రత స్థాయిలను మెరుగుపరచడంలో పిల్లలకు సహాయపడతాయి.

6. పుస్తకాలు చదివించండి : వార్తాపత్రిక లేదా ఏదైనా కథల పుస్తకాలని చదవడాన్నీ ప్రోత్సహించండి ఇది వారికి ఆలోచించే శక్తిని పెంచుతుంది. తద్వారా వారికీ ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

7. ప్లే డేట్‌లను ఏర్పాటు చేయండి : అంటే కొంతమంది పిల్లలను ఒకచోట కలిసేలా చేయడం. అవి మీ పిల్లల ఎదుగుదలకు మంచివి, ఆరోగ్యకరమైన మనస్సు మెదడు పనితీరు పెంచుతుంది.

చివరగా గుర్తుంచుకోండి, పిల్లల ఏకాగ్రత కోసం ముఖ్యమైన విషయాలలో ఒకటి, వారు చేసే పనులపై తల్లిదండ్రులు తగినంత శ్రద్ధ తీసుకోవడం, వారితో కొంత సమయం గడపడం మరియు వారితో కలిసి పనులు పంచుకోవడం పిల్లలకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

also read: 

Bala Krishna: నాపై పుకార్లు పుట్టించే ద‌మ్ము ఎవ‌డికైన ఉందా.. బాల‌య్య కూల్ వార్నింగ్‌

Twitter: ట్విట్ట‌ర్‌లో నా ఉద్యోగం ఊడింది అంటూ సంతోషం.. ఎలోన్ మస్క్ కి కౌంట‌ర్ మాములుగా లేదుగా..!

Exit mobile version