pimples : మొటిమలతో బాధపడేవారు ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- పసుపులో పుదీన రసం కలిపి మొటిమలతో పాటు చర్మసంబంధ సమస్యలున్నచోట రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే త్వరగా ఫలితం కనిపిస్తుంది.
- పసుపు, వేపాకు కలిపి రుబ్బి రాస్తే మొటిమలు, మొటిమల మచ్చలు కూడా తగ్గిపోతాయి.
- జాజికాయను పచ్చిపాలతో కలిపి గ్రైండ్ చేసి మొటిమల మీద రాస్తే త్వరగా మంచి ఫలితం ఉంటుంది. మొటిమ రాలిపోవడంతో పాటు మచ్చ కూడా పడదు.
- మూడు స్పూన్ల తేనెలో ఒక స్పూను దాల్చిన చెక్క పొడి కలిపి రాత్రి పడుకోబోయే ముందు మొటిమల మీద రాసి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా రెండు వారాలపాటు చేస్తే మొటిమలు పూర్తిగా పోవటంతో పాటు ఎప్పటికీ రావు.
- ఒక స్పూను నిమ్మరసంలో అంతే మోతాదులో దాల్చిన చెక్క పొడి కలిపి రాసినా మొటిమలు పోతాయి.
- కమలాపండు తొక్కలను అవసరమైన మేరకు నీటిని కలుపుతూ మెత్తగా రుబ్బి ఆ మిశ్రమాన్ని మొటిమల మీద రాయాలి.
- వెల్లుల్లిరేకను కొద్దిగా చిదిమి మొటిమ మీద చుట్టూ రాస్తుంటే మొటిమలు మచ్చపడకుండా పోతాయి.
- ఒక టేబుల్ వేరుశెనగ నూనెలో అంతే మోతాదు తాజా నిమ్మరసాన్ని కలిపి క్రమం తప్పకుండా ముఖానికి రాస్తే మొటిమలు రావు.
- మొటిమలు పెద్దవిగా ఉబ్బినట్లు ఉంటే పచ్చి బొప్పాయి రసం రాస్తే మంచి ఫలితం ఉంటుంది…
మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం చదవండి :
Home Remedies for Glowing Skin : మీ చర్మం కాంతివంతంగా మెరవాలంటే ..
eye care tips : ప్రపంచ అందాలను చూసే మీ కళ్ళు కాపాడుకోవాలంటే..?
how to get soft feet : మీ పాదాలు మృదువుగా ఉండాలంటే.. ఈ చిట్కాలను పాటించండి..!