how to remove lice from hair : తలలో పేలు ఉండి ఇబ్బంది పెడుతుంటే ఆ బాధ చెప్పతరం కాదు. అయితే పూర్తిగా పేలు పోవడానికి కొన్ని టిప్స్ ని మీతో పంచుకుంటున్నాము. ఇలా చేసి చూడండి..
- పటికను మెత్తగా నూరి నీటిలో కలిపి తలకు పట్టించు కొంటే చాలు.
- రాత్రిళ్ళు తలకు వెనిగర్ మర్దన చేసుకొని తర్వాత టవల్ తలకు చుట్టుకొని మరునాడు తలస్నానం చెయ్యాలి. ఇలా నాలుగు రోజులు చేస్తే ఈనెలు కూడా పోతాయి.
- తలస్నానం చేశాక సాంబ్రాణీ పొగ రోజూ వేసుకున్నా పేలు పోతాయి.
- సీతాఫలం గింజలను పొడి చేసి కొబ్బరినూనెలో కలుపు కొని తలకు రాసుకోవాలి. సీతాఫలం ఆకు రసాన్ని తలకు పట్టించి తుండు చుట్టుకొని రాత్రంతా ఉంచుకొని మరునాడు తలస్నానం చేయాలి.
- కలరా ఉండలు పొడి చేసి కొబ్బరినూనెలో కలిపి తలకు పట్టించి ఉదయాన్నే స్నానం చేసెయ్యాలి.
- కొబ్బరినూనెలో కరివేపాకు వేసి బాగా వేడిచేసి రంగు వచ్చిన ఆ నూనెను రాత్రివేళ తలకు మసాజ్ చేసి ఉదయాన కుంకుడు రసంతో స్నానం చేయాలి.
- బజార్లో దొరికే పేలమందును కొబ్బరినూనెలో కలిపి ఉంచుకొని పేలు కనిపించినప్పుడల్లా ఒక్కసారి రాసు కుంటే చాలు. చిన్నపిల్లలకు ఈ పేలమందు వాడకూడదని మాత్రం గుర్తు పెట్టుకోండి.
మరిన్ని మీకు నచ్చిన వాటిని చూడండి/చదవండి :
pimples : మొటిమలున్నాయని మొహమాటపడకండి..ఇలా తగ్గించుకోండి..!
janhvi kapoor at apoorva mehta birthday bash
Ananya Panday hot pics at Apoorva Mehta birthday party
Home Remedies for Glowing Skin : మీ చర్మం కాంతివంతంగా మెరవాలంటే ..