Spicy Potato poori తయారీకి కావలసినవి :
మైదాపిండి : 225 గ్రా.
బంగాళాదుంపలు : 225గ్రా.
ఆవాలు : 1/2 టీ స్పూను
ఉల్లిపాయలు : 55 గ్రా.
పచ్చిమిర్చి : 20 గ్రా.
గరంమసాలా : 1/2 టీ స్పూను
కొత్తిమీర : పావుకట్ట
నూనె : 300 గ్రా
ఉప్పు : తగినంత
Spicy Potato poori తయారీ : బంగాళాదుంపలు ఉడికించి, తొక్కు తీసి మెత్తగా ముద్దలా చేసుకోవాలి. మైదాపిండి జల్లించి డాల్డా, జీలకర్ర, గరమ్ మసాలా, కొత్తిమీర (కావాలనుకుంటే) వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కొని అందులో కలిపి ముద్ద చేసుకోవాలి. నీళ్ళు పట్టవు. అవసరమైతే రవ్వన్ని నీళ్ళు చిలకరించవచ్చు.ఈ ముద్దను పూరీలకు చేసినట్లు చిన్న చిన్న ఉండలు చేసుకొని వత్తుకోవాలి. ఇవి కొంచెం మందంగా వస్తాయి.
అంతేకాకుండా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వెయ్యటం వలన గుండ్రంగా ఉండవు. అందంగా కనిపించాలంటే ఏదైనా సీసామూత తీసుకొని దానితో నొక్కి చివర అంచులు తీసేస్తే గుండ్రంగా వస్తాయి. ఏదైనా పోటీలలో పాల్గొనేప్పుడు ఇలా చేసుకోవాలి. బాణలిలో నూనె పోసి ఈ పూరీలను బంగారు రంగు వచ్చేలా వేయించాలి. నూనెలోంచి పూరీలను తీసాక కాగితం మీద పెడితే నూనె పీల్చేసుకుంటాయి. అప్పుడు తినాలి. ఇవి వేడి మీద చాలా బాగుంటాయి. చల్లారినా కూడా బాగుంటాయి.
also read :
Naresh- Pavitra: ఎట్టకేలకు పవిత్ర మెడలో మూడు ముళ్లు వేసిన నరేష్..వైరల్‌గా మారిన వీడియో
RRR: విషం కక్కిన తమ్మారెడ్డికి నాగబాబు, రాఘవేంద్రరావు కౌంటర్స్
heat stroke : వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఎలా?