mushroom pepper fry కావాల్సిన పదార్ధాలు:
- మష్రూమ్స్ (పుట్టగొడుగులు) : 500 గ్రా.
- పచ్చిమిరపకాయలు : 8
- ఉల్లిపాయలు : 3 నూనె : 6 టీ స్పూన్లు
- మిరియాలు : 1/2 టీ స్పూను
- అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 11/2 టీ స్పూను
- క్రీమ్ : 1/2 టీ స్పూను
- పసుపు : 1/2 టీ స్పూను
- నిమ్మరసం : 2 1/2 టీ స్పూను
- కరివేపాకు పొడి : 1/2 టీ స్పూను
- కొత్తిమీర పొడి : 11/2 టీ స్పూను
- ఉప్పు : తగినంత
mushroom pepper fry తయారీ విధానం : ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. తర్వాత ఉప్పు కలిపిన వేడినీటిలో మష్రూమ్ని అరగంట నానబెట్టాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి నాలుగు నిముషాలు వేయించాలి.
తర్వాత మిరియాలు, కరివేపాకు పొడి, కొత్తిమీరపొడి, మష్రూమ్స్, పసుపు వేసి కాసేపు ఉంచాలి. ఆ తర్వాత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలా పది నిముషాలు వేగనివ్వాలి. చివరగా క్రీమ్, నిమ్మరసం వేసి కలిపి రెండు నిముషాలు ఉంచి దింపుకోవాలి. ఇది రోటీల్లోకి చాలా బాగుంటుంది.
also read :
Rana: ఒక్కసారిగా వార్తలలోకి రానా భార్య.. శభాష్ అంటూ పొగడ్తలు
horoscope today telugu : 06-04-2023 గురువారం రాశి ఫలాలు
moral stories in telugu : సరస్సులో చందమామ.. కథ చదవండి