minapa garelu
మినప గారెలు తయారీ కి కావలసిన పదార్థాలు:
200 గ్రా మినుములు; 100 గ్రా బియ్యం; 5 ఎండుమిర్చి; చిటికెడు ఇంగువ; 5 మిరియాలు; 1 టీస్పూన్ జీలకర్ర; 2 రెబ్బలు కరివేపాకు; ఉప్పు: తగినంత; వేయించడానికి సరిపడా నూనె ;
మినప గారెలు తయారీ విధానం:
ముందుగా మినుములు, బియ్యాన్ని విడివిడిగా ఆరు గంటల పాటు నానబెట్టాలి. తర్వాత వడపోసి రెండింటినీ కలిపి ఎండుమిర్చి, మిరియాలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అందులో సన్నగా తరిగిన కరివేపాకు, జీలకర్ర, ఇంగువ, తగినంత ఉప్పు వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి తడి గుడ్డ లేదా ప్లాస్టిక్ పేపర్ మీద సన్నగా వత్తుకోవాలి. ఇప్పుడు నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. కరకరలాడే మినప గారెలు రెడీ. పది రోజులు మంచి టైమ్ పాస్.
also read :
Oats Fruit Salad : ఓట్స్ ఫ్రూట్ సలాడ్ తయారు చేయండిలా ! సూపర్ టేస్టీ..!
Vada Recipe : బనానా క్యారెట్ వడ.. ఇలా చేసి చూడండి.. సూపర్ గా ఉంటుంది !