hair colour : శిరోజాలకు రంగు వేసుకోవడం ఎలా ?
మహిళలను ఎక్కువగా బాధించే విషయం శిరోజాలు. అతి చిన్న వయసులోనే తెల్లబడిపోవటం. అలా బయటకు వెళ్ళాలంటే బాగోదు. అందుకని మధనపడిపోకుండా చక్కగా వాటికి నల్లరంగు వేసుకోవటం ఉత్తమం. దీనితో మీ సౌందర్యం పెరుగుతుంది. మీలో చింత పారిపోతుంది. మరి ఎలానో చూద్దామా ?
ఇప్పుడు బజారులో రకరకాల షేడ్స్‌లో రకరకాల రంగులు. దొరుకుతున్నాయి. ఉదాహరణకు రాగి రంగు, ఎరుపు, బ్రౌన్, నీలి ఇలా ఆకర్షణీయమైన రంగులు ఎన్నెన్నో వస్తున్నాయి. విదేశాల్లో అయితే ఆకుపచ్చ, వయలెట్, ఊదా, పసుపుపచ్చ లాంటి రంగులు కూడా వాడతారు. వీటిని హెయిర్ ‘డై’లు అంటారు.
ఇక్కడ ఒక్క విషయం తప్పక గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కావాలనుకుంటే తప్ప రెడ్స్, గోల్డ్ వగైరా రంగుల్ని తెల్లజుట్టుకు వాడకూడదు. ఇలాంటివి వేసుకుంటే వెంట్రుకలు పసుపు లేదా పింక్ రంగులుగా మారుతాయి. ‘సెమీ పర్మనెంట్ కలర్స్’ అయితేనే శిరోజాలు సహజరంగును తగ్గించవు. కురులకు మరింత అందాన్ని కూడా ఇస్తాయి. గ్రే హెయిర్‌ను కనబడ నీయకుండా చేస్తుంది.
రంగు సెలెక్షన్ ఎలా ?
మీరు మీ శిరోజాలకు స్వయంగా రంగు వేసుకోదలచు కుంటే ఆ రంగు ఎప్పుడూ మీ శరీర ఛాయకు తగినట్లుగా ఉండాలి. పాలిపోయినట్లు వుండే తెల్లని చర్మానికయితే కొంచెం పసిమి ఛాయ రంగు మిశ్రమం బాగుంటుంది. మామూలుగా నలుపు, చామనఛాయ, తెలుపు రంగు ఇలా ఏ రంగు వారికైనా సహజంగా ‘నలుపు’ రంగు అయితేనే వెంట్రుకలు అందంగా కనిపిస్తాయి.
ఏ రంగు అయినా మన శరీర ఛాయకు సరి పోతుందో లేదో స్పష్టం చేసుకున్నాకే రంగును ఎన్నుకోవాలి. రంగు తగ్గించుకోవాలన్నా ముదురు రంగులుగా మార్చాలన్నా ‘పర్మినెంట్ టెంట్’ తో ఒకటి రెండుసార్లు షేడ్ చేసుకొని తర్వాత కలర్ వేసుకోవాలి. సహజమైన రంగు వచ్చేలా ‘సెమీ’ అవసరం అని గుర్తుంచుకోవాలి. రంగును ఎన్నుకునేముందు న్ని సంప్రదించటం
పర్మినెంట్ కలర్స్ :
ఒకసారి పర్మినెంట్ కలర్స్ వేస్తే ఆ శిరోజాల మీద అలాగే ఉండిపోతాయి. తిరిగి రంగు వద్దనుకున్నప్పుడు తీసివేయాలంటే వెంటనే సాధ్యపడదు. మళ్ళీ వెంట్రుకలు పెరిగిన ఆ తర్వాత కత్తిరించుకోవాలి. అంటే మొదళ్ళ నుంచీ నల్లవెంట్రుకలు కొంత పొడుగు పెరిగాకనే రంగుమేర భాగం వెంట్రుకలను కత్తిరించాలి. కేశనిపుణులు, కలరిస్టులు ఇలాంటి కృత్రిమరంగును పోగొట్టగలరు.
కానీ ఇది చాలా వ్యయంతో కూడుకున్నపని. అంతేకాదు కాలం కూడా వృథా అవుతుంది. పర్మనెంట్ కలర్స్ ఒకసారి వేస్తే చాలాకాలం రంగు నిలిచి ఉంటుంది. కాకపోతే కొత్తగా పెరిగిన భాగాలను 4 వారాలకొకసారి పాయలు విడదీసి రంగువేస్తూ ఉండాలి. లేకపోతే పాయ విడిపోయినప్పుడు తెల్లటి బార్డర్లాంటి గీత వస్తుంది. ఇలా రాకుండా జాగ్రత్తపడాలి. వెంట్రుకలు బాగా నల్లగా కనబడాలంటే రంగును చిక్కగా కలపాలి. నేచురల్ షేడ్ కావాలంటే కొద్దిగా పల్చగా మిక్స్ చేసుకోవాలి.
రంగు వేసుకునే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు
ఏ రంగు వేసుకోవాలన్నా ముందుగా మెడ వెనుకభాగంలో కిందగా ఒక పాయను తీసి రంగు వేసుకొని చూడాలి. కొద్దిగా లేకుంటే ఆ రంగు మీ చర్మ తత్వానికి సరిపోయినట్లే. అలా చర్మానికి అంటేలా 24 గంటలపాటు ఆగాలి. ఏ రియాక్షన్ కాక చర్మం వాయటం, ఎఱ్ఱబడటం లాంటివి జరిగినట్లయితే మీ చర్మ స్వభావానికి ఆ రంగు పడలేదని నిర్ధారించుకోవాలి. రసాయన పదార్థాలతో కూడిన రంగును సాధ్యమైనంత వరకు వాడకపోవడమే శ్రేయస్కరం. హెర్బల్ హెయిర్ డైలను ఉపయోగించడమే చర్మానికి, వెంట్రుకలకు, కళ్ళకు మంచిది.
మొదటిసారి శిరోజాలకు రంగు వేసుకోవాలనుకున్నప్పుడు ఆ బాధ్యత నిపుణులపై వుంచటమే ఉత్తమం. వారైతే మొత్తం తెల్లజుట్టును పూర్తిగా నలుపు రంగుగా మార్చగలరు. మొదటి సారిగా స్వయంగా వేసుకుంటే పాయలలో అక్కడక్కడా తెల్లవెంట్రుకలకు అంటక ఎబ్బెట్టుగా కనిపిస్తుంది.
రంగు వేసుకునే ముందు నుదురు భాగానికి లైట్‌గా వేజిలైన్ రాయండి. అవసరమైతే ప్లాస్టిక్ క్యాప్ (రిబ్బన్ టైప్) ధరించాలి. దీనివల్ల రంగు చర్మానికి అంటదు. రంగు వేసుకోవాలనుకున్నప్పుడు చేతులకు రబ్బరు తొడుగులు ధరించాలి. రంగు శిరోజాలకు వెయ్యడం పూర్తి అయ్యాక వెడల్పు పళ్ళు ఉన్న దువ్వెనతో పూర్తిగా రంగు అన్ని వైపులా సమంగా పరచుకునేలా దువ్వాలి.
రంగు వేయడానికి డై బ్రష్నుగానీ, స్పాంజి ముక్కను గానీ ఉపయోగించాలే తప్ప వేళ్ళు ముంచి పూయకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకుని శిరోజాలకు రంగు అద్దుకుంటే మీ అందం రెట్టింపు అవటం ఖాయం. మరి ప్రయత్నించండి !
also read :
భారతీయ ఋషులు ఎవరు? ఎంత మంది? ఆ ఋషుల వివరాలు తెలుసుకోండి..
grapes in summer : వేసవి కాలంలో రోజూ గ్రేప్స్ తింటే లాభాలు ఇవీ..
moral stories in telugu : మంచి స్నేహితుని కోల్పోయిన సింహం
Sonam kapoor Profile, Photos, Images, Stills 2023