heat stroke : మార్చి మొదటి వారం దాటడంతో ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపం కారణంగా చాలా మంది వడదెబ్బ బారిన పడుతుంటారు. దీంతో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
1. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల దాహార్తి పెరుగుతుంది. కూల్ వాటర్ కూడా పూర్తిగా దాహార్తిని తీర్చలేవు.
2. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్‌లు తాగడం వల్ల దాహార్తిని తీర్చుకోవచ్చు. పుచ్చ, తర్బూజా, నారింజ, బత్తాయి రసాలు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
3 ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడతాయి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సబ్జా నీళ్లు కూడా తరచుగా తాగుతుండాలి.
4. తీయదనం కోసం పళ్లరసాల్లో చక్కెర కలుపుకోరాదు. పళ్ల రసాలు ఎక్కువగా చేసుకుని, ఫ్రిజ్‌లో ఉంచి కూడా తాగరాదు. తాజా ఫ్రూట్ జ్యూస్‌లను తయారు చేసుకొని తాగేందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి.
5. ఘన పదార్థాలు ఈ వేసవిలో పరిమితంగానే తీసుకోవాలి. సాధారణంగా వేసవిలో జీర్ణవ్యవస్థ పనితీరు కొంతమేరకు కుంటుపడుతుంది.
6. బీర, సొర, పొట్ల, దోస లాంటి నీరు ఉండే కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వంటకాలను రోజుల తరబడి నిల్వ ఉంచకుండా తాజాగా చేసుకొని తినాలి.
also read :
RRR: కవలలు సైతం ఇలా చేయలేరంటూ రామ్ చరణ్, ఎన్టీఆర్‌పై గరికపాటి ప్రశంసలు