Telugu Flash News

way of life : యుక్తవయస్సు లో అమ్మాయిలు , అబ్బాయిలు ఎలా ఉండాలి ?

way of life : 13-19 వయస్సు పిల్లలు.. అమ్మాయికాని, అబ్బాయికాని టీనేజ్ రాగానే వారి ప్రవర్తన లో ఎన్నో మార్పులు జరుగుతాయి. అన్నీ నాకు తెలుసు అంటారు. తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఆలకించారు. ఉడుకు రక్తం, ఏదైనా చేసేయగలం అనే ధీమా తో ఉంటారు. ఏదో ఒకటి చేయాలనుకుంటారు.. యువతకు ప్రపంచం గురించి పెద్దగా తెలియదు.. ఆ క్రమంలో ఒక్కోసారి చేయకూడని తప్పులు చేస్తుంటారు..అవి వారి జీవితాలను ఎంత ప్రభావితం చేస్తాయో అర్థం కాదు..

18 ఏళ్ల వయసులో పిల్లలకి తల్లిదండ్రుల సపోర్ట్ ఎంతో అవసరం. అయితే ఆ ఏజ్ లో వారు చేయకూడని పనులు ఏంటి ? ఇంటర్ నుండి డిగ్రీ లోకి మారే సమయం ఇది. ఈ వయస్సులో వారు తీసుకునే ప్రతి నిర్ణయం అతని/ఆమె జీవితాన్ని మొత్తం ప్రభావితం చేస్తుంది. 18 ఏళ్లు నిండిన అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఇద్దరూ కొన్ని తప్పులు చేయకూడదు.. వాటి గురించి ఆలోచించకూడదు.. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. సమయం వృధా : 18 ఏళ్లు వయస్సు వచ్చే సరికి ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ చదివే సమయం. తమ కెరీర్‌లో ముఖ్యమైన దశ లోకి ప్రవేశిస్తారు. కానీ చాలామంది ఇప్పుడే చదువును నిర్లక్ష్యం చేస్తారు . టైమ్ వేస్ట్ తప్ప ఏమీ లేదు. కాంటీన్ లో, కాలేజీ గ్రౌండ్ లో , బయట కాఫీ షాప్ లో.. సమయాన్ని వృధా చేస్తారు. అది వారి ఫ్యూచర్ కి సంబంధించిన తప్పుడు నిర్ణయం కావచ్చు. కాబట్టి ఆడ, మగ ఇద్దరూ ఈ వయసులో ప్రతి విషయంలోనూ బ్యాలెన్స్‌ని మెయింటెయిన్ చేస్తూ చదువులపై దృష్టి పెట్టాలి.

2. వృథా ఖర్చులు చేయడం : తల్లిదండ్రులు డబ్బులు ఇస్తున్నారు కదా అని ఎక్కువగా డబ్బులు వేస్ట్ చేయవద్దు. ఆ ఏజ్ లో వారు సంపాదించుకున్న స్వంత డబ్బు అయిన కావచ్చు లేదా వారి తల్లిదండ్రుల ఇచ్చిన డబ్బు అయిన కావచ్చు. తమ పాకెట్ మనీని నిత్యావసరాలకు మాత్రమే ఖర్చు చేయడం మంచిది.

3. ఆలోచించి అడుగేయండి : అబ్బాయి అయినా, అమ్మాయి అయినా, పగటి కలలు కంటారు, అవి అన్నీ నిజం కావు , తప్పుడు నిర్ణయాలు చాలా సులభంగా తీసుకుంటారు. కాబట్టి అబ్బాయిలు, అమ్మాయిలు ఏది సరైనదో తెలుసుకోండి .. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి.. అప్పుడు మీకు దాని గురించి పూర్తి అవగాహన వస్తుంది..

4. ఆకర్షణ : ఈ వయసు రాగానే ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియకుండా వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు.మీకు కూడా ఇలాగే జరుగుతుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రేమ తప్పు కాదు, ఇతర సంబంధాలను మరియు చదువును నిర్లక్ష్యం చేయడం తప్పు. అలా చేస్తే మీ బంగారు భవిష్యత్తు నాశనం అవుతుంది.. గుర్తుపెట్టుకోండి..

5.కెరీర్‌ పై దృష్టి : 18 ఏళ్ల తర్వాత డిగ్రీ వరకు పూర్తి చేయడం సర్వసాధారణం. ఇలాంటి సమయాల్లో అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ కెరీర్‌ని నిర్లక్ష్యం చేయకుండా ఏ రంగంలో ముందుకు వెళ్లాలనుకుంటున్నారో ఆ గోల్ వైపు అడుగులు వేయండి. మీ ఫ్యూచర్ బాగుండాలంటే జాబ్ తప్పనిసరి. అందుకే బాగా ఆలోచించి మీ లక్ష్యాన్ని ఏర్పరుచుకోండి.

read more news :

Lifestyle Changes can prevent acid reflux ?

Exit mobile version