Telugu Flash News

Suryakumar Yadav: హార్డ్ వ‌ర్క్ టూ స్మార్ట్ వ‌ర్క్.. టీమిండియా జ‌ట్టులో సూర్యకి స్థానం ఎలా ద‌క్కిందంటే..!

Mohammad Rizwan hails Suryakumar Yadav, opens up on their battle for No 1 T20I ranking

Mohammad Rizwan hails Suryakumar Yadav, opens up on their battle for No 1 T20I ranking

Suryakumar Yadav: ప్ర‌స్తుతం భార‌త క్రికెట్ జ‌ట్టులో కీల‌క‌మైన ఆట‌గాడిగా పేరొందాడు సూర్య‌. డివిలియ‌ర్స్ త‌ర్వాత 360 డిగ్రీల‌లో షాట్స్ ఆడే స‌త్తా ఒక్క సూర్యకుమార్‌లో ఉంది. 2010లో తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన తర్వాత భారతదేశం జెర్సీని ధరించడానికి 11 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది.

కొన్నేళ్లుగా డొమెస్టిక్ క్రికెట్‌ మరియు ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ సూర్యకుమార్ తన కలలు సాకారం చేసుకునేందుకు చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చింది.

ఏది ఏమైనప్పటికీ, 2021లో ముంబై ఇండియన్స్‌తో అద్భుతమైన ఐపీఎల్‌ సీజన్ తర్వాత స్టైలిష్ రైట్-హ్యాండర్ భార‌త జ‌ట్టులో ఆడే అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్నాడు.

భార్య దేవిషా శెట్టి కీలక పాత్ర

సూర్యకుమార్ భార్య దేవిషా శెట్టి తన కెరీర్ గ్రాఫ్‌ను మార్చడంలో కీలక పాత్ర పోషించిందని ప‌లుమార్లు చెప్పుకొచ్చాడు.

వీరిద్ద‌రు 2016 జులైలో వివాహం చేసుకున్నారు. డ్యాన్స‌ర్‌గా దేవిషా శెట్టికి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.47 లక్షలకి పైగా ఫాలోవర్లు ఉన్నారు. వీరిద్ద‌రు ఒకే కాలేజీలో చ‌దువుకోగా, ఆ స‌మ‌యంలో ప్రేమ పుట్టింద‌ని చెబుతుంటారు.

అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిల‌వ‌గా, ఆయ‌న క‌న్నా ముందు సురేష్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, దీపక్ హుడా ఉన్నారు.

అయితే సూర్య కెరీర్‌లో అతని భార్య పాత్ర చాలా కీల‌కం. అతని బలహీనతలను చెప్ప‌డం, మంచి ఆహారాన్ని అందించ‌డం, శిక్ష‌ణా స‌మయంలో తోడ్పాటు అందించ‌డం వ‌ల‌న సూర్య త‌న క‌న్న‌క‌ల‌ను నిజం చేసుకున్నాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తొలిసారిగా భారత్ త‌ర‌పున ఆడాడు సూర్య కుమార్ యాద‌వ్. అయితే తాను త‌న ఫిట్‌నెస్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు.

ఓసారి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… 2020లో నా శరీరం పూర్తిగా భిన్నంగా ఉంది. డైటింగ్ ప్రారంభించాను. నా శరీరం దేనికి అలవాటు పడిందో, నాకు ఏది సెట్ అవుతుంది, నేను ఎలా ముందుకు వెళ్ళగలను” అని గ్రహించడానికి దాదాపు ఏడాదిన్నర పట్టింది అని అన్నాడు.

నిత్యం ప్రాక్టీస్ చేస్తాన‌ని, అయిన ఆశించిన ఫలితాలు రాలేదని సూర్యకుమార్ వెల్లడించాడు. అతని ఆహారంలో మార్పులు, శిక్షణా విధానం జాతీయ జట్టులోకి ప్రవేశించ‌డానికి ఎంతో దోహ‌ద‌ప‌డ్డాయ‌ని చెబుతుంటారు.

2018 తర్వాత నా శిక్షణ, డైట్, నెట్ సెషన్‌లలో చాలా మార్పులు చేసుకున్నాడు. అవ‌న్నీ నాకు బాగా సహాయపడ్డాయి. ఐపిఎల్‌లో కూడా ప‌రుగులు చేయ‌గ‌లిగాను, స్థిరత్వం వచ్చింది , దాంతో టీమిండియా ఛాన్స్ అందుకున్నాను” అని సూర్యకుమార్ చెప్పుకొచ్చారు.

32 ఏళ్ల ఈ బ్యాట్స్‌మెన్ భారత బ్యాటింగ్ లైనప్‌లో ప్రధానమైన క్రికెట‌ర్ కాగా, టీ20 ప్రపంచ కప్ 2022 జట్టులో భాగం అయ్యాడు. మ‌రి ఇందులో రాణించి భార‌త జ‌ట్టుకి ట్రోఫీని అందిస్తాడా అన్న‌ది చూడాలి.

ఇవి కూడా చదవండి :

Puri Jagannath: పూరీ జ‌గ‌న్నాథ్‌కి ప్రాణ హాని ఉందా.. లైగర్ డైరెక్ట‌ర్ పోలీస్ కంప్లైంట్‌

Bigg Boss 6: గేమ్ లోకి వ‌చ్చిన గీతూ.. రేవంత్‌ని భ‌లే ఇరికించేసిందిగా..!

Vitamin B12 deficiency: విటమిన్ B12 లోపం యొక్క లక్షణాలు ఏమిటి? ఎలా చికిత్స చేయాలి? విటమిన్ B12 సమృద్ధిగా ఉన్న ఉత్తమ ఆహారాలు ఏంటి ?

Exit mobile version