indian currency : భారతదేశంలో కరెన్సీ ముద్రణ నిర్వహణ బాధ్యతను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) చూసుకుంటుంది, అయితే డినామినేషన్లను నియంత్రించే బాధ్యత మాత్రం భారత ప్రభుత్వంపైనే ఉంది. గరిష్టంగా రూ.10,000 విలువ ఉన్న కరెన్సీ నోట్లను ముద్రించే అధికారం RBIకి ఉంది. ప్రజలు ఎక్కువగా ఉపయోగించే కరెన్సీ నోట్లను ముద్రించడానికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం, RBI భరిస్తాయి.
అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం నోట్ల ముద్రణ ధర పెరుగుదలకు దారితీసింది. 2021 నుండి కాగితం, ఇంక్ ధరలు విపరీతంగా పెరిగాయి. RBI రూ.500 నోట్ల కోసం కంటే రూ.200 నోట్ల ముద్రణకే ఎక్కువ ఖర్చు పెడుతుంది. రూ.10 నోటు ముద్రణ ఖర్చు రూ.20 నోటు ముద్రణ కంటే ఎక్కువ. నోట్లను ముద్రించడం కంటే నాణేల తయారీకే ప్రభుత్వానికి ఎక్కువ ఖర్చు అవుతుంది.
20 రూపాయల 1000 నోట్లతో పోలిస్తే 10 రూపాయల 1000 నోట్లను ముద్రించడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. మనీకంట్రోల్ నివేదించిన ప్రకారం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ లిమిటెడ్ (BRBNMPL) ముద్రణ సంస్థ నుండి RTI ద్వారా పొందిన సమాచారం ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 10 రూపాయల 1000 నోట్లను ముద్రించడానికి రూ. 960 ఖర్చవుతుంది.
రూ.10 నోటు ముద్రణ ఖర్చు 96 పైసలు అయితే, 20 రూపాయల 1000 నోట్లను ముద్రించడానికి RBI రూ. 950 ఖర్చు చేస్తుంది, అంటే ఒక్కో నోటు ధర 95 పైసలు. అప్పుడు 20 రూపాయల 1000 నోట్లతో పోలిస్తే 10 రూపాయల 1000 నోట్లను ముద్రించడానికి ఎక్కువ ఖర్చవుతుంది. 2022 ఆర్ధిక సంవత్సరంలో, 50 రూపాయల 1000 నోట్ల ముద్రణ ధర 1,130 రూపాయలు కాగా, 100 రూపాయల 1000 నోట్ల ధర రూ.1,770.
ప్రస్తుతం అధిక డిమాండ్‌లో ఉన్న 200 రూపాయల 1000 నోట్లను ప్రింట్ చేయడానికి RBI రూ.2,370 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే రూ.200 నోట్ల ముద్రణ కంటే రూ.500 నోట్ల ముద్రణ ఖర్చు తక్కువ కావడం గమనార్హం. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రూ.1000 నోట్ల ముద్రణ ధర కూడా కేవలం రూ.2,290.
also read :
Samantha: సమంతపై ప్రశంసలు కురిపించిన సానియా మీర్జా.. కారణం ఏంటంటే..!